ఒక ఊరిలో చీకటి పడితే చాలు ఊరి చివరి నుండి ఎవరో మాట్లాతున్నట్లు పెద్దగా శబ్దాలు వినపడుతున్నాయట.. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ప్రతి రోజు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొనేందుకు గ్రామస్తులు చాలాసార్లు ప్రయత్నించారు. 

 

చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయం పరిశోధకులు సైతం తెలిసింది. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి రంగంలోకి దిగారు. మనుషులు లేకుండా మాటలు వినిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? వివరాల్లోకి వెళితే బీహార్ లో రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలకు అందుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 400 ఏళ్ల కిందట బస్తర్‌లో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయాన్ని నిర్మించారు.

 

ఎన్నో అతీత శక్తులను పొందడానికి అప్పటి రాజులు ప్రత్యేకంగా ఈ గుడిని నిర్మించారని సమాచారం. వేకువ జామున ఎంతో మనోహరంగా, సుందరంగా ఉండే ప్రశాంత ఆలయం మాత్రం రాత్రి పుట జనాలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ ఆలయాన్ని నిర్మించిన రాచ కుటుంబికులకు, స్థానిక ప్రజలకు రాత్రి వేళల్లో ఏవో మాటలు వినిపించేవి. ఎంతో స్పష్టంగా వినిపించే ఆ మాటలను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. పూజారులు మాట్లాడుతున్నారని గ్రామస్తులు అనుకోగా, వారు మాట్లాడలేదని వెల్లడించడంతో అమ్మవారులే మాట్లాడుతురని ప్రచారం జరుగుతుంది.

 

ఆలయం గురించి తెలుసుకున్న ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడం విఫలమయ్యారంటే.. అది నిజంగా చిత్రమే. మరో విషయమేంటంటే ఈ ఆలయంలో కలశం కూడా ఉండక పోవడం గమనార్హం. త్రిపురా, ధూమవతి, బగులముఖీ, తారా, కాలీ, చిన్మస్త, శోదాశీ, మాతాంగి, కమలా, ఉగ్ర తార, భువనేశ్వరి తదితర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఆ మాటలను వీరు వినాలనుకుంటే మాత్రం ఆలయాన్ని ఒక్కసారి సందర్శించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: