నవ నందుల మార్గం గురించి ఇపుడు తెలుసుకుందాం... మహానంది, గణపతి నంది మరియు గరుడ నంది అనే 3 నందులు ఉన్నాయి. శివ నంది, సూర్యనంది, విష్ణునంది లేదా కృష్ణ నంది, మహానంది నుండి నంధ్యాల వెళ్ళే మార్గంలో 14 కి.మీ. దూరంలో బండి ఆత్మకూరు మండలం, కడమల కాల్వ గ్రామంలో కృష్ణ నంది (లేదా) విష్ణు నంది ఉన్నది. ఆచటి నుండి సుమారు 9 కి.మీ. దూరంలో శివ నంది ఉన్నది. ఈ రెండునందులు మహానంది నుండి నంధ్యాల వెళ్ళే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వున్నవి.

 

శివనంది అతి పురాతనమైనది. ప్రశస్తమైన రాతి కట్టడము. చాలా హుందాగా ఉంటుంది. గుడిగోపురం లోపలి వైపున ఒక రంద్రము ఉంది. ఆరంద్రము వద్దనే పంచముఖ నాగేంద్రుని బొమ్మఉంటుంది. ప్రతి శివరాత్రికి అర్ధరాత్రి 12 గంటలకి ఆలయంలో హడావుడి నిలుపుదల చేస్తారని, ఆ సమయంలో ఆ రంద్రము ద్వారా అయిదుతలల నాగేంద్రుడు లోపలికి వస్తాడని, శివలింగాన్ని చుట్టుకొని సుమారు 2నిమిషాలు దర్శనం ఇచ్చి మరలా అదే ద్వారం ద్వారా వెలిపోతాడని, పిమ్మట శివరాత్రి ఉత్సవం కంటిన్యూ చేస్తారని ప్రతీతి.

 

ఇచ్చటనే పంచపాడవులు ప్రతిష్టించిన శివలింగాలు వున్నవి. సూర్య నంది మహానందికి సుమారు 7కి.మీ. దూరములో బొల్లవరం గ్రామ సమీపములో ఉన్నది. ఈ లింగం ఎరుపు వర్ణముతో తమలపాకు వలె శివుడి మూడవ కన్నువలే ఉంటుంది. ఈ లింగానికి మన నుదురు కన్నువద్ద తాకించి, ఐదు నిమిషాలుంచితే మన శరీరం లోకి ఆ లింగంనుంచి వైబ్రేషన్స్ వస్తాయి. మంచి అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా, ఉత్తరాయణ పుణ్య కాలములో ప్రతిరోజూ ప్రాతఃకాలమునందు సూర్య రశ్మిపడుతుంది. 

 

నంద్యాల పట్టణమునందు రైల్వే స్టేషన్ సమీపములో ప్రధమ నంది, బస్ స్టాండు సమీపములో ఆంజనేయస్వామి గుడి లోపలి భాగమునందు నాగ నంది, నంద్యాల పట్టణములో మరో మహిమాన్విత జగజ్జననీ అమ్మవారి గుడి సమీపములో సోమనంది.. ఉన్నవి. దేశములో కల రెండు జగజ్జననీ ఆలయములలో ఒకటి ఉత్తరాదిన హిమాలయ పర్వతములలో రెండవది నంద్యాలలోనూ ఉన్నవి. నవనందుల దర్శనం ఎంతో భాగ్యంతో కూడుకున్నదని చెబుతూవుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: