భ‌క్తుల‌ కోరిన కోర్కెలు తీర్చే అంజన్న.. పూలు, పత్రులతో పూజించగానే కొండంత అండై నిలిచే అంజనిసుతుడు గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ధైర్యన్నిస్తాడు. అందుకే ఆ ఆంజనేయస్వామిని అత్యంత భక్తితో పూజిస్తారు. ఇక‌ శ్రీరాముని పేరు వినగానే  మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తువస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడు, మారుతి,  బజరంగబలి, అంజనిసుతుడ‌నీ ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు. ఇదిలా ఉంటే..  ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వచ్చే తిరుమల తిరుపతి లో తప్పకుండ దర్శించాల్సిన ప్రదేశం జాపాలి తీర్థం కూడా ఒక‌టి.

 

 ఇక్కడ వెలసిన హనుమంతుడు కి చాలా పురాణ ప్రాముఖ్యత కల్గిన చరిత్ర ఉంది. ఈ ప్రదేశం లో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడయాడిన ప్రదేశం ఈ జాపాలి. జాపాలి తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిశలో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు.. ఎత్తయిన వృక్షాలు.. ఇలా పచ్చటి లోయలో వెలసిన ప్రాకృతిక పర్ణశాల జాబాలి తీర్థం. దీనినే జాపాలి తీర్థంగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడి జాబాలి తీర్థంలో స్నానం చేసిన భక్తులు పాపాల నుండి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం.  

 

దేవతల కోరిక మేరకు శ్రీమహావిష్ణువు రామావతారం అవతరించాడు నిర్ణయం జరుగగా, జాబాలి అనే మహర్షి ఆంజనేయస్వామి రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకోగా, ఇక్కడ రుద్రుడు ఆ మహర్షి తపస్సుకి మెచ్చి తన రాబోయే అవతారం గురించి చూపిస్తాడు. అదే ఆంజనేయస్వామి అవతారం. మరొక కథ ఆధారంగా అంజనాదేవికి హనుమంతుడు ఇక్కడే జన్మించాడని పురాణం. ఇక జాబాలి తీర్థంలో వెలసిన ఆంజనేయుని ఆలయం నిత్యం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంటుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: