చంద్రుని కదలికలను అనుగుణంగా ఉండే చాంద్రమానం కు , సూర్యుని కదలికలను అనుగుణంగా ఉండే సౌర మానంకు లెక్కల్లో కొన్ని తేడాలు వస్తుంటాయి. అందులో సౌరమానంలో సంవత్సరానికి కేవలం 360 రోజులు మాత్రమే వస్తాయి. అదే చాంద్రమానంలో 365 రోజులు వస్తాయి. ఇలాంటి తేడాలను సరిచేసి ఒకే లైనుపై తీసుకొచ్చే ప్రయత్నాన్ని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చేశారు. ఇలా రెండు మానాలను సర్దుబాటు చేసిన కాలాన్నే అధిక మాసం అంటారు.
ఈ మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ , ఆ పౌర్ణమితో కూడుకున్నటువంటి విశేష గుణగణాలు కనిపించవని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో సంక్రమణం కూడా రాదు. అసంక్రాంతి , ద్విసంక్రాంతి వస్తుంది. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని చెబుతున్నారు.


ఇలా సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహ కార్యక్రమాలు , ఇంట్లోకి ప్రవేశించడం , ఉపనయనాల వంటివి చేయకూడదు.
ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా కూడా పిలుస్తారు. ఉత్తమ పురుషగా అందరి జీవులలో ఉండేవాడు.. సర్వజీవులలో ఆత్మస్వరూపుడిగా ఉండే వాడు పరమాత్ముడు. ఆ విధంగా పరమాత్ముడిని దర్శించడానికి , అందుకు ప్రాతిపదికగా తనలో ఉన్న ఆత్మను దర్శించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది.

అధికమాసములో నిషిద్ధ కార్యములు

అనిత్యమనిమిత్తంచ దానం మహాదానం|
ఆగ్య్నధానాధ్యరాపూర్వతీర్థయాత్రామరేక్షణం||
దేవారామతటాకాదిప్రతిష్టాం మౌంజి బంధనం |
ఆశ్రమ స్వీకృతం కామ్యపృషోత్వర్గంచ నిప్క్రమం||
రాజ్యాభిషేకం ప్రథమం చూడాకర్మ ప్రతానిచ|
అన్నప్రాశన మారంభం గృహాణాం చ ప్రవేశనం||
స్నానం వివాహం నామాతిపన్నం దేవమహోత్సవం | వ్రతారంభం సమాప్తిం చ కామ్యకర్మచ పాప్మనాం I|
 ప్రాయశ్చిత్తం చ సర్వ స్యమల మాసే వర్జయేత్|| -
(బృహస్పతిః- స్ర్మతి ముక్తావళి)

మహా దానములు, అగ్నాధానము, యజ్ఞము, ఉద్యానవనముల నిర్మాణము, చెరువుల నిర్మాణము, ఉపనయనము, సన్యాస స్వీకారము, జ్యోతిష్టోమాది కామ్యకర్మలు, పసిపిల్లలను మొదటి సారి ఇంటి నుండి బయటకు తీసుకువెళ్ళి, పట్టాభిషేక కార్యము, చౌలము, విశేష వ్రతాలు, అన్నప్రాశనము, గృహారంభము, గృహప్రవేశము, విశేష తీర్థస్నానము, వివాహము, వామకరణము, ప్రాయశ్చిత్త హోమాలు, ఈ కార్యములను అధికమాసములో చేయకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: