తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది.... రాజకీయరంగంలో పోటాపోటీగా  నేతలు  తమ తమ పద్మవ్యూహలతో నువ్వా.. నేనా..??? అంటూ ఎలక్షన్స్ కి రెడీ కానున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీ కాలం ఈ ఫిబ్రవరి, 2020తో పూర్తి కానున్న సందర్భంగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ముందడుగు వేస్తూ లేఖలు సిద్ధం చేసింది. తెలంగాణలో అన్ని ముఖ్య పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు  సంబంధించిన  విషయాన్ని తెలుపుతూ లేఖలు రాసింది. సోమవారం ఈ మేరకు అన్ని ప్రధాన పార్టీల అధ్యక్షులకు లేఖలను పంపారు ఎన్నికల సంఘం అధికారులు. దీంతో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయాలను తీసుకొని.... అందులో భాగంగా ఈ లేఖల కార్యక్రమం మొదలుపెట్టినట్టు స్పష్టమైంది.


 రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే  ప్రజానికంలో తమ జోరు ను పెంచి ఆ దిశగా కసరత్తులు పెట్టారు. ఈసీ సైతం ఎన్నికల నిర్వహణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. అందులో అన్ని పార్టీల ఎన్నికల పై తమ అభిప్రాయాలను తెలపాలని సూచించారు.
రానున్న జీహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖలు ద్వారా విషయాన్ని తెలియ జేసింది.
ప్రస్తుతం కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న కారణంగా జీహెచ్ఎంసి ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహణ చేపట్టాలా? లేదా ఈవీఎంల ద్వారా నిర్వహించాలా? అన్న విషయంలో రాజకీయ పార్టీలు తమ ఉద్దేశాలను తెలుపాలన్నది ఈసీ రాసిన లేఖల సారాంశం అని తెలుస్తోంది.


ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో  ముందుగా స్పష్టం కావాల్సిన అంశంగా రాజకీయ పార్టీల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ... రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రముఖ రాజకీయ పార్టీలకు లేఖలు పంపి తద్వారా వారి నిర్ణయాలను తెలుసుకునేందుకు యత్నిస్తోంది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి అభిప్రాయాలు తెలపాలని, ఏమైనా సూచనలు వుంటే తెలపాలని  ఈసీ లేఖలో పేర్కొన్నది. కానీ ఒకవేళ 30వ తేదీ తరువాత ఏవైనా సూచనలు ఇచ్చిన  అవి పరిగణనలోకి తీసుకోబడవని ఎన్నికల అధికారి క్లారిటీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: