
సనాతన ధర్మం ప్రకారం ‘ఏ ప్రవర్తనా నియమావళి.. మూలసూత్రాలు మరియు ఏ న్యాయం చేత వ్యక్తిగత, సామాజిక, మతపర జీవితం సజావుగా సాగుతుందో దానికి కారణం సర్వ జీవజాలం. ఈ ప్రకృతిలోని ప్రతి ఒక్క వస్తువు లేదా జీవం మరొక దానితో అనుసంధానం చేయబడి ఉంటుంది. మన రాష్ట్రాలలో ఎక్కువగా రోలు మరియు రోకలిని ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా వాటిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకంటే రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ఎంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ధాన్యం, జొన్నలు, సజ్జలు, రాగులు, తైదలు, కొర్రలు తదితర ధాన్యాలను బాగా దంచి వంటకు అనువుగా చేసుకుని వండుతారు. ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన వారి ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అప్పటితరం వారికి రోగాలనేవి ఎక్కువగా వచ్చేవి కావు.
కానీ ఇప్పుడలా కాదు మనము ప్రతి ఒక్క పదార్ధాన్ని బయటనే కొంటున్నాము. వాటినే తింటున్నాము, తద్వారా మన ఆరోగ్యం పాడయిపోతోంది. కాబట్టి మన వంటకాలను మన ఇంటిలో ఉన్న రోలు మరియు రోకలితో చేసుకోవడం ఉత్తమం. అందుకే శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తు చేయడం, స్వయంగా అన్నింటినీ సిద్ధం చేసుకోవడం వంటివి చేస్తూ ఆరగించేవారు. అలాగే మీరు తినండి.. పది మందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని ఆరాధించేవారు. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. ఈ విధంగా రోలును లక్ష్మీదేవితో, రోకలి ని విష్ణువుతో, తిరుగలిని శివుడితో మరియు దాని పిడిని పార్వతితో పోల్చుకుంటూ దేవతలుగా ఆరాధిస్తారు. దీనివల్ల వారికి ధన ప్రాప్తి సిద్ధిస్తుందని గట్టిగా నమ్ముతారు.