అయితే ఇక్కడ అలాంటి వారు అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే...మన పురాణాల్లో ఎక్కడా కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళితే చెడు జరుగుతుందని చెప్పబడలేదు. సాధారణంగా కొన్ని కొబ్బరి కాయలు కుళ్లిపోయి ఉంటాయి. ఆ విషయం మనకు తెలియదు కాబట్టి దేవుడి దగ్గర కొడతాం. భగవంతుడు ఒక్కటే చెప్పాడు....భక్తితో మరియు ప్రేమతో ఫలం, పుష్పం ఏది ఇచ్చినా స్వీకరిస్తానని, కానీ మనమేమో అవన్నీ మరిచిపోయి లేని పోని మూఢనమ్మకాలు పెట్టుకుని చింతిస్తూ ఉంటాము. ఈ విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీత లో కూడా చెప్పబడి ఉంది.
కాబట్టి భక్తులందరూ కొబ్బరి కాయ కుళ్లినా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనమే కావాలని కుళ్ళిన కొబ్బరి కాయని తెచ్చి కొట్టలేదు కదా...భగవంతుని మీద ఎంత ప్రేమ ఉందన్నదే ప్రధానము. కొబ్బరి కాయలో పువ్వు వస్తే అదృష్టం అని కొబ్బరికాయ కుళ్ళితే దురదృష్టమన్నది కేవలం అపోహలు మాత్రమే. ఇటువంటి వాటిని నమ్మి మీ మనసును పాడు చేసుకోకండి. అయితే భగవంతుని మీద పరిపూర్ణ విశ్వాసంతో పూజ చేస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. భగవంతుడి మనుషులకి మంచి చేస్తాడే తప్ప...ఎట్టి పరిస్థితుల్లోనూ చెడును కలిగించడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి