ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు ఇబ్బందులు తప్పక ఉంటాయి. వారి జీవితంలో ఏదో ఒక సమయంలో వీటిని తప్పక అనుభవిస్తారు. అయితే ఈ ఇబ్బందులు ఏ విషయానికి సంబంధించి అయినా కావొచ్చు, విద్యకి సంబంధించి కావొచ్చు లేదా ప్రేమలో పేయిలవ్వడం కావొచ్చు లేదా ఆర్ధికంగా కావొచ్చు..కుటుంబ పరంగా కావొచ్చు...అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ.. మనం వాటన్నింటినీ అధిగమించి ముందుకు ఎలా వెళ్లాలి అనేది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది.అయితే ఇలా జీవితంలో విజయం సాధించేందుకు అవసరమయ్యే రహస్యాలను ఆ పరమేశ్వరుడు వెల్లడించారు.

మనకున్న పురాణాల ప్రకారం పరమ శివుడు తన జీవిత భగస్వామి అయినా పార్వతీ దేవితో ఈ విషయాల గురించి తరచూ చెబుతూ ఉండేవారట.. అయితే శివుడు చెప్పిన ఆ విషయాలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతాయి. అవేమిటో ఒకసారి తెలుసుకుందాము.  మనం చేసే ప్రతి పనిలో పట్టుదల మరియు సంకల్పం ఉన్నంతవరకు, మనం వాటిని మరింత మెరుగ్గా చేయగలం. ఏదైనా ప్రయత్నం బాగా జరగాలని మీరు కోరుకుంటే, మీరు మనస్సులో దృఢమైన నిబద్ధత కలిగి ఉండాలి. సంకల్పం తప్ప మరేది అవసరం లేదు.

సమాజంలోని కొందరు చెప్పే మంచి విషయాల వల్ల మీలో అహం పెరగొచ్చు. వారు చెప్పే చెడు విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ రెండూ మీ పతనానికి దారి తీస్తాయి. అందుకే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో చూసి కలవరపడటం మానేయాలి. సమాజంలోని కొందరు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తినా.. వినయంగా ఉండాలి. వాటిని అతిగా నమ్మకండి. అప్పుడే మీ లక్ష్యాలపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు.  మీకు గురువులతో ఉన్న సంబంధం మంచిది అయినా.. చెడ్డది అయినా, వారిపై ఎప్పుడూ మీరు గౌరవం కలిగి ఉండాలి. వారు మీకు నేర్పిన పాఠాలు పరీక్షల్లో రాకపోయినా.. జీవితంలో మాత్రం కచ్చితంగా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: