హిందువుల సంప్రదాయం ప్రకారం దేవుడిని పూజించే విధానంలో దీపారాధన అనేది చాలా కీలకమైనది. అయితే కొందరు నిత్యం పూజలు చేస్తుంటారు. మరి కొందరు నిత్య పూజా విధానాన్ని పాటించరు. కానీ దీపం అనేది పూజా మందిరంలో ప్రతి దినము వెలిగించడం వలన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఇంట్లోని వ్యక్తుల మనసులు ఎంత గందర గోళంగా ఉన్నప్పటికీ దీపాన్ని చూడగానే కాస్త మనశ్శాంతి దొరుకుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. దీపం అనగా జ్యోతి... జ్యోతి అంటే దైవం. ఆ దైవము సాక్షాత్తు దీపం రూపంలో మన ఇంట్లో కొలువై ఉంటారని పండితులు చెబుతున్న మాట. అందుకే నిత్యము దీపారాధన చేయుట మంచిది. దీపం నుండి వెలువడే కాంతి మానసిక ఒత్తిడిని తగ్గించి, దైర్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా దీపం వెలిగిస్తే అందరి దేవుళ్ళను మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. 

ఇలా నిత్యం దీపారాధన చేయడం ద్వారా సకల దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి.  ముఖ్యంగా లక్ష్మీ మాత అనుగ్రహం కోసం ఎదురు చూసే వారు తప్పకుండా నిత్య పూజ, నిత్య దీపారాధన చేయాలి. వెండి, పంచ లోహాలు అదే విధంగా మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించుట మంచిది.  ఇక దీపాన్ని ఉదయాన్నే సూర్యోదయానికి ముందే తెల్లవారు జామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం సర్వ శ్రేష్ఠం. అదే విధంగా సంధ్యా సమయంలో అయితే 6 తర్వాత దీపారాధన చేయుట మంగళకరము.

రెండు పూటలా పూజ చేయలేని వారు ఉదయం కంటే కూడా, సాయంత్రం పూజ చేసి దీపారాధన చేయుట మంచిది. దీపారాధన కొరకు ఆవు నెయ్యి వాడుట అన్నిటికన్నా ఉత్తమము. పూజ చేసే ముందు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవాలి. మనసులోకి ఎటువంటి వక్రపు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: