పితృ పక్షంలో ప్రారంభమైంది. అక్టోబర్ 6 వరకు సాగే ఈ ప్రత్యేక సమయంలో కాకులను పూర్వీకుల రూపంగా భావిస్తారు. శ్రద్ధ పక్షంలో పెద్దలకు పెట్టే ఆహారాన్ని కాకి తింటే ఆ ఆహారం పూర్వీకులకు చేరుతుందని అంటారు. అలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. పితృ పక్షంలో కాకి ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది. తర్పణం చేసేటప్పుడు కాకి వెనుక భాగంలో కూర్చుంటే అది చాలా శుభ సూచకమని నమ్ముతారు. పూర్వీకుల ఆశీస్సులతో కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అయితే కాకిని పూర్వీకుల రూపంగా ఎందుకు భావిస్తారు ? అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మెదిలే ఉంటుంది. ఆ విషయాన్నే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కాకికి సంబంధించిన ఈ కథ త్రేతాయుగంలో జరిగినట్టుగా చెప్పుకుంటారు. ఒకసారి ఇంద్రుని కుమారుడు జయంతుడు కాకి రూపంలోకి మారి తనకు తెలియకుండానే సీతమ్మ వారిని గాయ పరిచాడట. ఇది చూసిన రాముడు కోపంతో తన బాణంతో కాకి ఒక కన్నుగాయపడేలా చేశాడట. ఆ తర్వాత జయంతుడు తన తప్పును గ్రహించి శ్రీరామునికి క్షమాపణ చెప్పాడట. అప్పుడు శ్రీ రాముడు శాంతించి అతడిని క్షమించాడట. పైగా ఇప్పటి నుంచి మీకు ప్రజలు పెట్టే ఆహారం పూర్వీకులకు చెందుతుంది అని చెప్పాడట. అప్పటి నుండి కాకిని పూర్వీకుల రూపంగా భావిస్తారు. పితృ పక్షం అనేది పూర్వీకులకు అంకితం చేశారు పెద్దలు. ఈ సమయంలో కాకి కనిపిస్తే, అది మీరు ఇచ్చిన ఆహారాన్ని తింటే అది పూర్వీకుల ఆశీర్వాదంగా భావిస్తారు.


శాస్త్రీయ పరంగా దీని అర్థం ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి ప్రతి జంతువు, పక్షికి దాని స్వంత ప్రాముఖ్యత ఉందని ప్రజలు అర్థం చేసుకోవాలి. కాకిని మోసపూరిత పక్షిగా పరిగణిస్తారు. కానీ వాస్తవానికి ఇది స్వీపర్ లాగా పని చేస్తుంది. చిన్న కీటకాలు, కాలుష్య కారకాలను కూడా తింటుంది. అలా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందువల్ల ప్రకృతి పరంగా వాటి రక్షణ చాలా ముఖ్యం. కానీ చెట్ల నరికివేత కారణంగా కాకుల సంఖ్య కూడా తగ్గడం ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: