ఆయుధ పూజ ని ప్రతి ఒక్కరం చేసుకుంటాము అయితే ఈ ఆవిడ పూజ ఎలా ఆవిర్భవించింది ఎందుకు చేసుకుంటారో అనే విషయం ఎప్పుడూ చూద్దాం.

ఆయుధ పూజను మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో దుర్గాష్టమి రోజున, కొన్ని ప్రాంతాలలో మహా నవమి రోజున చేస్తూ ఉంటారు. విజయానికి ఈ రెండు రోజులు ఆయుధ పూజలు చేసుకొని విజయదశమినాడు విజయానికి చిహ్నంగా జమ్మి చెట్టును పూజిస్తూ ఉంటారు. మన దక్షిణ భారతదేశంలో ఈ ఆయుధపూజ ను ఎక్కువగా మహా నవమినాడు చేస్తూ ఉంటారు.

శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి ఆయుధం చేపట్టి దుర్గాష్టమి రోజున దుర్గముడు అనే రాక్షసుడిని , మహా నవమి నాడు మహిషాసురుడనే రాక్షసుని సంహరించడం వల్ల ఆనాడు ఆయుధాలలో ఉన్న శక్తి స్వరూపిణి పూజిస్తూ.. ఆయుధాల శత్రు సంహారానికి మాత్రమే వినియోగించాలని, ఆయుధ దుర్వినియోగం జరగకూడదని ఈ ఆయుధ పూజ చేసే ఆనవాయితీ మన భారతదేశంలో కనిపిస్తుంది.

అలాగే లలిత సహస్ర నామాలలో చెప్పినట్లు సర్వేశ్వరీ సర్వ మైయి సర్వ మంత్ర స్వరూపిణి. అంటే సర్వ యంత్రలలోనూ,మంత్లలోనూ,తంత్రాలలోనూ, అన్ని చోట్ల ఆలలితా మాతయో ఉన్నది అని అర్థం. వ్యాపారస్తులు ఉద్యోగస్తులు రోజు తాము ఉపయోగించే పనిముట్లలోను యంత్రాలలోనూ వాహనాలలోనూ చైతన్య రూపంలో ఉండే ఆ శక్తి స్వరూపిణి పూజిస్తే.. వాటి ద్వారా కలిగి ఆపముచ్చు దోష విమోచన నివారణ జరిగి. వాటి వినియోగం క్షేమదాయకంగాను, లాభదాయకంగాను ఉంటుంది.

ఇదే కాకుండా ప్రతినిత్యము ఆడవారు ఎక్కువగా వంటింటి దగ్గరే ఉంటున్నారు. అయితే వారిని ఆ ఆపద నుంచి కాపాడేందుకు.. అప్పట్లో వంటింటి సామాగ్రి అని కూడా ఆయుధ పూజ కింద పూజిస్తే.. సర్వ పత్ని అయిన దుర్గాదేవి అందరిని సర్వదా చల్లగా చూస్తుందని శాస్త్రం తెలుపుతోంది. ఇక ఎవరైనా విద్యార్థులు తమకు విజయం చేకూరాలని పెన్నులు పుస్తకాలను దేవుడి ముందర పెట్టి పూజించేవారు. ఇలా ఎవరి ఆయుధ సామాగ్రిలు వారు పూజించు కోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: