హిందూ శాస్త్రం ప్రకారం శివరాత్రి హిందువులకు చాలా పెద్ద పండుగ.. శివుడు లింగాకృతి పొందిన రోజు కూడా ఇదే. అందుకే దేశం అంతా శివరాత్రి రోజున శివాలయాల్లో శివ పూజలు చేస్తూ శివయ్య స్మరణలో లీనం అయిపోతూ ఉంటారు. ఇకపోతే అలాంటి పర్వదినాన కూడా కొన్ని చేయకూడని పనులు ఉన్నాయట అవేంటో ఇప్పుడు చూద్దాం..


శివరాత్రి రోజున మద్యం,  మాంసం వంటి వాటిని అస్సలు ముట్టుకోకూడదట.. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఉదయం స్నానం చేయాలి.. ఉదయం 8 లోపు కచ్చితంగా శివాలయాన్ని దర్శించాలట. అంతేకాదు చెంబుడు నీళ్ళనైనా సరే స్వామివారికి అభిషేకించాలని గేదె పాల కంటే ఆవు పాలు మాత్రమే అభిషేకానికి చాలా ఉత్తమమైనవని చెప్పవచ్చు.. అంతేకాదు గర్భగుడికి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా శరీరంపై కండువా కప్పుకొని మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి..

ఒకవేళ మహిళలు అభిషేకం చేస్తున్న సమయంలో శివలింగాన్ని తాకకూడదు అలాగే మన శరీరం నుంచి చమటలు కానీ వెంట్రుకలు కానీ శివుడి లింగం పై పడకుండా జాగ్రత్త పడాలి.. పాల ప్యాకెట్లను నోటితో కొరికి ఆ పాలతో స్వామివారిగా అభిషేకం చేయకూడదు.. శివరాత్రి రోజున భార్యాభర్తలు కూడా సంభోగానికి దూరంగా ఉండాలి. కాదని చేసినట్లయితే పాపాలు మూటగట్టుకుంటారు.. శివుడి దేవాలయానికి మొగలి పువ్వులను తీసుకురాకూడదు..అంతేకాదు శివ అభిషేకం పూర్తయిన తర్వాత శివ పూజలో తులసి ఆకులను కూడా ఉంచకూడదు.. మీకు ఉన్నదాంట్లోనే పేదలకు దానం చేయాలి అందులోనూ తోటకూర దానం చేస్తే మరింత ఫలితం లభిస్తుంది.

శివరాత్రి రోజున స్వామివారి జాగరణం చేస్తూ ఆయన పైన దృష్టి సారించి మనసుతో స్వామి వారిని ఆరాధిస్తే ఆయన మన కోరికలను నెరవేరుస్తాడని పెద్దలు విశ్వసిస్తారు. కాబట్టి శివరాత్రి సమయంలో మీరు ఇలాంటి కొన్ని పనులకు దూరంగా ఉంటూ స్వామివారి స్మరణలో ఉంటూనే స్వామి వారి పూజ చేసుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత తో అటు ఆయురారోగ్యాలు కూడా సిద్ధిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: