ప్రస్తుతం దేశమంతా సనాతన ధర్మం వైపు పరిగెడుతోంది. ఒకప్పుడు  ప్రపంచ దేశాలలో చాలావరకు సనాతన ధర్మమే పాటించేవారు.  ఒకప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కూడా  మన హిందూస్తాన్ లో భాగం గానే ఉండేది. దీనివల్ల చాలా వరకు హిందూ సంప్రదాయం అనేది చాలా దేశాలకు పాకింది. అందుకే అఖండ భారతదేశం అంటూ అప్పుడప్పుడు స్మరిస్తూ ఉంటారు. అయితే అలాంటి ఈ దేశంలో ఎక్కువగా హిందువులే ఉండడమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా హిందుత్వానికి సంబంధించిన మూలాలు చాలా వరకు ఉన్నాయి. తాజాగా బిజెపి పార్టీ హిందుత్వం అనే ఏజెండాతో భారతదేశం అంతా హిందూ నినాదం ఉండాలి.. 

సనాతన ధర్మం పాటించాలని పాటుపడుతున్నారు. ఇదిలా నడుస్తున్న తరుణంలో కొంతమంది భారతదేశంలోనే ఉంటూ సనాతన ధర్మం లేదు తొక్కా లేదు అంటూ మాట్లాడుతున్నారు. ఇలా హిందుత్వం మీద కుట్రలు చేస్తూ వారి రాజకీయ అవసరాలకు ప్రజలను వాడుకుంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకోవడం వల్ల అనేక దేశాలలో హిందుత్వం అనేది చాలా వరకు అణచివేయబడింది. కానీ దాని మూలాలను ఎవరూ చెరపలేకపోతున్నారు. హిందుత్వం ఇతర దేశాల్లో కూడా ఉన్నదనడానికి తాజాగా ఒక సాక్ష్యం బయటకు వచ్చింది. అమెరికన్ సైంటిస్టులు సిరియా దేశంలో ఋగ్వేదానికి సంబంధించినటువంటి మూలాలను కనుక్కున్నారు.

మూడు వేల ఏళ్ల క్రితం నాటి కొన్ని గుర్తులను అక్కడి గోడలపై సైంటిస్టులు కనుగొన్నారు. అంటే హిందూ సంస్కృతిలో సిరియా కూడా ఒక భాగమే అని అర్థం అయిపోతుంది. ప్రపంచ దేశాలలో హిందుత్వం అనేది ఏ విధంగా అణచివేయబడుకుంటూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మనం ఇలాగే చూసుకుంటూ ఉంటే ఇండియాలో కూడా  ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.కేవలం సిరియాలో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో అక్కడక్కడ హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి.అలా ప్రపంచంలో ఎక్కడ చూసినా హిందూ మూలాలు కచ్చితంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: