భారతదేశం లోని ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను చాలా ఎక్కువగా పాటిస్తారు. అలాగే పూర్ణిమ, అమావాస్య వంటి వాటిని కూడా ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. అలా చాలామంది హిందువులు పూర్ణిమ రోజు ఎలాంటి పనులు చేయాలి.. ఎలాంటి పనులు చేయకూడదు..అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి..ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు. అయితే నేడే అత్యంత పవిత్రమైనటువంటి మాఘ పూర్ణిమ అనే సంగతి మనకు తెలిసిందే.. ఈ మాఘ పూర్ణిమ రోజు ఈ పనులు చేయడంతో పాటు ఈ ఒక్క శ్లోకం పఠిస్తే సక్సెస్ మీదే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.. మరి ఇంతకీ ఆ శ్లోకం ఏంటి..మాఘ పూర్ణిమ రోజు చేయాల్సిన పనులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

 మాఘ పూర్ణిమ రోజు దేవతలు పవిత్ర నదీ స్నానం ఆచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పూర్ణిమ రోజున సముద్ర స్నానం గానీ, నది స్నానం గానీ చేసి దానధర్మాలు చేస్తే ఎన్నో ఇబ్బందులు తొలిగిపోతాయని, ముఖ్యంగా పితృ దోషాలు జాతక దోషాల నుండి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. అయితే అందరికీ నది స్నానం చేయడం కుదరదు. ఇలాంటి వాళ్లు ఇంటి దగ్గర కూడా స్నానం ఆచరించి " గంగే చ యమునే చైవ" అనే శ్లోకాన్ని పఠిస్తే అంతా మంచే జరుగుతుందని పురోహితులు చెబుతున్నారు.అలాగే ఈ మాఘ పూర్ణిమ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం కానీ మాంసాహారాన్ని కానీ ముట్టుకోకూడదట. ముఖ్యంగా ఈరోజు కొత్త బట్టలు,నువ్వులు, రేగి పండ్లు దానం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే ఈరోజు ఒక చిన్న మంచి పని చేసినా కూడా కోటి రెట్ల ఫలితం వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈరోజు నారాయణుడిని, గంగమ్మని స్మరించుకుంటూ పితృ తర్పణాలు వదిలేస్తే చాలా మంచిదని అంటున్నారు.ఇక ఈరోజు సాయంత్రం సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు తొలిగిపోయి సంపదలు కలుగుతాయని పురోహితులు అంటున్నారు. అలాగే ఈ మాఘ పూర్ణిమ రోజు చేసే హోమాలు, జపాలు అన్ని పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించేలా చేస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఈ మాఘ పూర్ణిమ రోజు మీరు ఈ విషయాలను ఫాలో అవుతున్నారా..

మరింత సమాచారం తెలుసుకోండి: