
క్రీడల్లో మన దేశం గత కొన్ని సంవత్సరాలుగా విజయకేతనం ఎగురవేస్తున్న విషయం తెలిసినదే క్రికెట్, కబడ్డీ మరియు బ్యాడ్మింటన్ మొదలగు ఆటలతో స్త్రీ విభాగం పురుషవిభాగాలు అన్ని ఆటలలో రాణించడంతో వారు అందరి మన్ననలు పొందుతున్నారు. అలాగే ఈ మధ్య జరుగుతున్న దక్షిణాసియా క్రీడల్లో ప్రారంభ వేడుకలు మాత్రం అట్టహాసంగా నేపాలోని దశరథ స్టేడియంలో నేపాల్ దేశ రాష్ట్రపతి బిద్యాదేవి భండారి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ప్రారంభ వేడుకలు నేపాలీ సంప్రదాయ శైలీలో అట్టహాసంగా వేడుకల్ని నిర్వహించారు. ప్రారంభ వేడుకలు అందరినీ అలరించాయి మొదటగా టోర్నీలో పాల్గొంటున్న ఏడు దేశాల అథ్లెట్లు మార్చ్‌పాస్ట్ నిర్వహించగా ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలతో దాదాపు అన్ని దేశాల కళాకారులూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు వీరి సాంప్రదాయ నృత్యాలతో అక్కడి క్రీడామైదానమంతా సందడిగా మారింది.
భారత పురుషుల వాలీబాల్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సాధారణంగా ఆటల్లో మన దేశం వేరే దేశాలపైనా విజయం సాధించింది అంటే మన క్రీడాకారులను అభినందిస్తుంటాం కానీ వారు శత్రు దేశమైన పాకిస్థాన్ పైన విజయం అంటే అబ్బో ఆ ఆటకు ఆడే క్రీడాకారులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు ప్రేక్షకులకు ఒక పెద్ద పండుగలాంటిదే ఆ రోజు. అయితే వివరాల్లోకి వెళితే ఆదివారం జరిగిన పురుషుల వాలీబాల్ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకపై విజయం సాధించింది మరో సెమీస్‌లో పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఈ విదంగా మంగళవారం రోజు భారత్-పాక్‌ల మధ్య టైటిల్ పోరు తుది పోరుని చేసే అదృష్టం దక్కింది.
అలాగే భారత మహిళల వాలీబాల్ జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల విభాగంలోనూ భారత్ తుది ఫైనల్లో నేపాల్‌తో తలపడుతుంది. ఈ రెండు ఫైనల్ మ్యాచ్‌లు మంగళవారం జరుగుతాయి.ఈ ఆటలకు గాను అభిమానులు చాలామంది ఆటకు హాజరయి వీక్షించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పొలిసు సిబ్బందిని సెక్యూరిటీలను భారీగా స్టేడియం లో ఏర్పాటు చేసారు.