మన దేశంలో క్రికెట్ అంటే ఎంత  క్రేజ్ ఉంటుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి చూసే ప్రేక్షకులు ఎంతో మంది. ఇక క్రికెట్ ఆటగాళ్ళ కంటే టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఎక్కువగా టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటారు.మైదానంలో  ఆడుతున్న ఆటగాళ్ళకి టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మన దేశంలో క్రికెట్ ప్రేక్షకులను అంతలా  ప్రభావితం చేసింది. తమ అభిమాన ఆటగాళ్లు  సిక్సర్లు ఫోర్లు కొడుతుంటే తెగ సంబరపడిపోతూ ఉంటారు టీవీల ముందు కూర్చుని అభిమానులు . ఇక ఐపీఎల్ వచ్చిందంటే మాత్రం క్రికెట్ సందడి డబుల్  అయిపోతుంది అనే విషయం తెలిసిందే. 

 

 

 ఇకపోతే గత కొంతకాలంగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి  కానీ ఇప్పటివరకు తన రిటైర్మెంట్పై ధోనీ మాత్రం స్పందించలేదు. అయితే ధోని అంశమే ప్రస్తుతం ఇండియా క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మళ్లీ జట్టులోకి వస్తాడ లేక రిటైర్మెంట్ ప్రకటిస్తారా అన్నది మాత్రం అందరికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్లో ధోని ఆడుతాడా ఆడడ  అనేది కూడా సందేహంగానే మారిపోయింది. అయితే ధోని వచ్చి మైదానంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తే చూడాలని అభిమానులు అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. 

 

 

 అయితే మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలోకి ఆడితే చూడాలని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరికీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఉత్సాహాన్ని నింపే ఓ వార్త చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్లో మహేంద్రసింగ్ ధోని ఆడనున్నాడు అని బిసిసిఐ మాజీ అధ్యక్షుడు  చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాస్ తెలిపారు. అంతేకాదు వచ్చే సీజన్లో కూడా ధోని ఆడుతున్నాడని తెలిపారు శ్రీనివాస్. 2021 ఎడిషన్ కు ముందే జరిగిన వేలంలో ధోనిని  విడుదల చేస్తామని... అనంతరం తిరిగి రివైస్  చేసుకుంటామని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్త ధోని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: