క్రికెట్ లో ధోనికి  సహజ ఆటగాళ్లందరూ అమితమైన గౌరవం ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చాలామంది స్టార్ క్రికెటర్ లు అందరూ ధోనీ సారథ్యంలో రాటుదేలిన వారే. ధోని సలహాలు సూచనలతో రాణించిన వారే . కేవలం సహచర ఆటగాల్లు మాత్రమే  కాదు.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ఎంతో గౌరవిస్తూ ఉంటారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా  విజయవంతంగా ముందుకు నడిపించి  ఏకంగా మూడుసార్లు టైటిల్ సాధించిన ధోనీ అంటే జట్టు ఆటగాళ్లకు ఫ్రాంఛైజీకి  కూడా ఎనలేని అభిమానం గౌరవం. ఎన్ని కష్ట పరిస్థితులు ఎదురైనా జట్టును ప్లే ఆప్ కి చేరుస్తూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. అందుకే ధోని క్రికెట్ ఆడినన్ని  రోజులు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి అతనే  క్యాప్టెన్ అని అటు ఫ్రాంచైజీ కూడా ప్రకటించింది. అంటే ధోని  మీద ఎంత గౌరవం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

 

 ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... మార్చి 29 ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు మధ్య మార్చి 29 న జరగనుంది. దీంతో ఎన్నో రోజులనుండి క్రికెట్ కు దూరంగా ఉంటున్న ధోని ... సహచర ఆటగాళ్లతో కలిసి మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రాక్టీస్ మ్యాచ్లో ధోనీ బ్యాట్  సురేష్ రైనా కాలితో తన్నిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం రెండు జట్లుగా విడిపోయి ప్రస్తుతం చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాయి. 


 ఈ క్రమంలోనే ధోనీ జట్టులో ఆడుతున్న సురేష్ రైనా వ్యూహాల గురించి పిచ్  మధ్యలో ధోని తో మాట్లాడుతూ పొరపాటున ధోని బ్యాట్ ను  కాలితో తన్నాడు. సురేష్  రైనా తో ధోని  మాట్లాడుతున్న క్రమంలో  తన బ్యాట్ ను ఫ్యాడ్స్ ముందు ఉంచి.. చేతి గ్లౌస్ ని సరి చేసుకుంటుండగా.. సురేష్ రైనా ఇలా బ్యాట్  తన్నేసాడు. ఇక పొరపాటున కాలితో తన్నడం వెంటనే గమనించిన సురేష్ రైనా... ఎంతో వినమ్రంగా ధోని బ్యాట్ అని చేతిలో తాకి మొక్కుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక ధోని కే కాదు ధోని బ్యాట్ కి  సురేష్ రైనా  ఇచ్చిన గౌరవం పై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ లో ధోనీతో కలిసి దీర్ఘకాలంగా ఆడుతున్న ఆటగాళ్లలో సురేష్ రైనా ఒక విషయం తెలిసిందే. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్లో కూడా ధోనీ సారథ్యంలో సురేష్ రైనా ఎన్నో మ్యాచ్లు ఆడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: