క‌రోనా వైర‌స్... చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రపంచం మొత్తం దీని బారిన పడ్డవారు లక్షలలో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఇది క్రికెట్ లోకి ప్రవేసింది. అది ఎలాఅంటే ఇంగ్లాండ్ స్టార్ క్రికెట‌ర్ అలెక్స్ హేల్స్ క‌రోనా వైర‌స్ వ్యాధికి గుర‌య్యాడ‌ని సమాచారం అందుతోంది. అనుమానంతో క‌రోనా ల‌క్ష‌ణాల‌తో అత‌ను పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ నుంచి వైదొలిగి, ఇంగ్లాండ్‌ కు చేరుకున్నాడు. కాకపోతే ఈ విషయం అత్యంత నాట‌కీయంగా అత‌ని పేరు బయటికి వచ్చింది.

 

 


మొదట పీసీబీ హేల్స్ పేరును బ‌య‌ట‌పెట్టేందుకు వెనకాడింది. ఒక విదేశీ ఆట‌గాడికి క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు కనిపించడంతో అతడిని తన సొంతదేశానికి పంపించామ‌ని బోర్డు సీఈఓ వ‌సీమ్ ఖాన్ ఒక సందర్బంగా తెలిపాడు. ఈ దశలో కామేంటేట‌ర్ ర‌మీజ్ రాజా ఆ ప్లేయ‌ర్ పేరు చెప్పి అంద‌రినీ ఒకింత తెర దించాడు. కాకపోతే పిఎస్ఎల్ సంద‌ర్భంగా హేల్స్‌కు క‌రోనా అనుమానిత ల‌క్ష‌ణాలు గుర్తించ‌డంతో అతన్ని వెంట‌నే తన దేశమైన ఇంగ్లాండ్‌ కు పంపించార‌ని కామేంటేట‌ర్ ర‌మీజ్ రాజా తెలిపాడు. అలాగే అక్కడ ఉన్న ప్ర‌సార‌క‌ర్త‌లు, కామెంటేట‌ర్ల‌కు కూడా క‌రోనా ప‌రీక్ష‌ల‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఇకపోతే క‌రోనా దెబ్బతో ప్రస్తుతం పీఎస్ఎల్‌ను ప్ర‌స్తుతానికి పూర్తిగా వాయిదా వేశారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: