ప్రపంచ క్రికెట్ లో కేవలం కొన్ని దేశాలు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్నాయి. మిగతా దేశాల ఆడక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా కూడా ప్రపంచ క్రికెట్లో అడుగు పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దానికి ఆ దేశ క్రీడాకారులను కూడా సన్నద్ధం చేస్తుంది. కాకపోతే అది ఏమటుకు సరిపోవడం లేదు. ఆ దేశంలో క్రికెట్ కు అంతగా ఆదరణ లేదని చెప్పవచ్చు. కాబట్టి అక్కడ మిగతా క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

 


ఇక అసలు విషయానికి వస్తే... భారత దేశంలోని కర్ణాటక మాజీ ఆటగాడు అరుణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక రంజీ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే అరుణ్ కుమార్ ను అమెరికా క్రికెట్ జట్టుకు కోచ్ గా జే. అరుణ్ కుమార్ పేరును ప్రకటించింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు Us బోర్డ్ తెలిపింది. అయితే తన పేరు ఖరారైన తర్వాత అరుణ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తాను కరోనా కారణంగా ఇప్పుడిప్పుడే అమెరికాకు వెళ్లే పరిస్థితి లేదని తెలిపాడు.

 


అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో అమెరికాకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వీసా కార్యక్రమాలు పూర్తయిన దాని గురించి ఆలోచిస్తాను అని తెలిపాడు. చిన్న, పెద్ద ప్రణాళికలతో ముందుకు సాగుతామని కూడా ఆయన తెలిపాడు. అన్నిటికంటే ముఖ్యంగా అమెరికా దేశాన్ని టెస్ట్ క్రికెట్ ఆడే దిశగా తీర్చిదిద్దుతానని అదే నా ప్రధాన లక్ష్యమని అరుణ్ కుమార్ తెలిపాడు. అయితే కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాతనే అమెరికాకు బయలుదేరి వెళ్తానని ఆయన మీడియా పూర్వకంగా తెలిపారు. ఏది ఏమైనా ఒక ఇండియాన్ ప్లేయర్ అమెరికాకు కోచ్ గా సెలెక్ట్ అవ్వడం నిజంగా అభినందించాల్సిన విషయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: