టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ అభిమానులు అందరూ పిలుచుకునేది మిస్టర్ కెప్టెన్ . ఎందుకంటే ఎప్పుడూ మైదానంలో కూల్ గా ఉంటూ తనదైన వ్యూహాలతో మ్యాచ్ ను  విజయతీరాలకు నడిపిస్తూ ఉంటాడు  మహేంద్ర సింగ్ ధోని . అయితే మహేంద్ర సింగ్ ధోనీ చాలా అరుదుగా కోపం తెచ్చుకొంటూ  ఉంటాడు. ఎలాంటి ఒత్తిడినైనా కూల్ గా సాల్వ్  చేస్తూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. అందుకే మహేంద్ర సింగ్ ధోనీ మిస్టర్ కూల్ కెప్టెన్ అంటూ ఉంటారు. అయితే తాజాగా గౌతమ్ గంభీర్ మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

 ప్రస్తుతం లాక్ డౌన్ సందర్బంగా  ఇంటికే పరిమితమైన ఆటగాళ్లందరూ... ధోని కెప్టెన్సీ లో  తాము ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గౌతం గంభీర్ తనకు ధోని తో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ధోనీ మిస్టర్ కూల్ ఏమీ కాదని... ధోని మిస్టర్ కూల్ అనడంలో వాస్తవం లేదు అని అంటున్నారు గౌతం గంభీర్. 

 

 2017 వరల్డ్ కప్ చూసుకున్న మిగతా వరల్డ్ కప్ లు చూసుకున్నాను ధోనీ తన ఆవేశాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నాడని.. అతను కూడా మనిషి కాబట్టి కోపం రావడం సహజమే అంటూ చెప్పుకొచ్చాడు గౌతం గంభీర్. ఇక ఐపీఎల్ లో కూడా సీఎస్కే తరఫున కెప్టెన్గా ఉన్న మహేంద్రసింగ్ ధోని.. ఎవరైనా ఆటగాడు క్యాచ్ వదిలేసినప్పుడు  కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి అంటూ గుర్తు చేశాడు. అందుకే ధోని మిస్టర్ కూల్  కాదు అంటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటి వరకు భారత్ కెప్టెన్ గా  చేసిన మిగతా వారితో పోలిస్తే మాత్రం ధోని  మిస్టర్ కూల్ అనేది వాస్తవమే చెప్పుకొచ్చాడు గౌతం గంభీర్. కాని ప్రతిసారి  మిస్టర్ కూల్ కాదని... కానీ తన కంటే మాత్రం ధోని చాలా కూల్ అంటూ తెలిపాడు. కాగా ధోనీ సారథ్యంలో 2007,  2011 ప్రపంచ కప్ సాధించింది  టీమిండియా జట్టు.. ఈ రెండు సార్లు భారత జట్టులో ధోనీ సారథ్యంలో గంభీర్ కూడా ఈ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: