టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఢిల్లీ లోని ఒక ప్రాంత ఎంపీ అయిన గౌతం గంభీర్ మరోసారి తన దేశభక్తిని చాటి చెప్పేలా భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది ని ఏకేసాడు. ఇక అసలు విషయంలోకి వెళితే....


కాశ్మీర్ కోసం పాకిస్తాన్ దేశం 70 సంవత్సరాలుగా బిచ్చమెత్తుకుంటోంది అని గౌతం గంభీర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇది వరకే చాలాసార్లు గౌతం గంభీర్, షాహిద్ అఫ్రిది ల మధ్య మాటల దాడులు చాలానే జరిగాయి. ఇకపోతే కరోనా వైరస్ దెబ్బతో ఇబ్బందిపడుతున్న వారికి ఆఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటన చేశాడు. అయితే అక్కడ స్థానికులతో మాట్లాడుతూ భారత్ పై తనకున్న విద్వేషాన్ని అఫ్రిది చాటిచెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఆ వీడియోలో అఫ్రిది రెచ్చగొడుతూ మాట్లాడుతూ... ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే భారత ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అఫ్రిది.

 


ఇక ఈ అనుచిత వ్యాఖ్యలపై వచ్చిన వీడియోలు చూసిన గంభీర్ ఆగ్రహానికి లోనై ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని రాసుకొచ్చాడు. షాహిద్ అఫ్రిదీ, ఇమ్రాన్ ఖాన్, బజ్వా లాంటి జోకర్లు మోడీ గారిపై, భారత్ పై వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. అసలు పాకిస్తాన్ లో కేవలం ఏడు లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అందులో అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడని అలాంటి దేశం గత 70 సంవత్సరాలుగా కాశ్మీర్ కోసం బిచ్చమెత్తుకుంటోంది అని తెలిపాడు.. అంతేకాకుండా జడ్జిమెంట్ డే వరకు కాశ్మీర్ పాకిస్థాన్ కు దక్కదని, బంగ్లాదేశ్ గుర్తుంది కదా అని 1977 యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ గంభీర్ తీవ్ర వ్యాఖ్యలు ట్విట్టర్ ముఖంగా సంధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: