ధోనీ కెప్టెన్సీ అంటే ఏ రేంజిలో ట్విస్టులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధోని ఆడే మైండ్గేమ్ ఎవరికీ అంతుపట్టదు. అనూహ్యమైన ఎత్తుగడలు వ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ ఉంటాడు మహేంద్రసింగ్ ధోని. ఇక ఊహించని వ్యూహాలను ఆచరణలో పెట్టి విజయం సాధిస్తూ ఉంటాడు. ఎంత ఒత్తిడి ఉన్న మైదానంలో ఎంతో కూల్గా ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఉంటాడు. కానీ ఈ సారి మాత్రం ఐపీఎల్లో ధోనీ కెప్టెన్సీలో అలాంటివి ఏవీ కనిపించడం లేదు. ఒక సాదాసీదా జట్టు ఆడుతున్నట్లు గానే ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం కొనసాగుతోంది. గత మ్యాచ్లో ఎలా అయితే ఆడి ఓటమి చవి చూసారో  తర్వాత మ్యాచ్ లో  కూడా అదే ఆటతీరు కొనసాగిస్తున్నారు.



 ఈ క్రమంలోనే ధోనీ కెప్టెన్సీపై ధోని ఆటతీరుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న  రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో పూర్తిగా విఫలమైంది. కేవలం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటివరకు ఈ  ఐపీఎల్ సీజన్ లో అతి తక్కువ స్కోరు ఇదే అని చెప్పాలి. ఇక ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో అయినా  స్కోరును కాపాడుకుంటుంది అంటే అది కూడా జరగలేదు.



 మొదట చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినట్లు అనిపించినప్పటికీ ఆ తరువాత మాత్రం భారీ పరుగులను ఇచ్చేశారు. అయితే ఈ మ్యాచ్లో ధోని ఎలాంటి మైండ్ గేమ్ ఆడలేదు. ఇద్దరు కుడిచేతి వాటం బ్యాట్స్మన్లు  కుదురుకుంటున్న వేళ ఎడమచేతి వాటం పేసర్ అయినా  సామ్ కరణ్ తో  బౌలింగ్ చేయించి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు భావించారు. ధోని  కూడా అదే చేస్తాడు  అని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సామ్ కరణ్ తో  బౌలింగ్ చేయించలేదు ధోని. అతన్ని బాగా వాడుకొని ఉంటే ఎంతో ప్రయోజనం చేకూరేది అని అటు అభిమానులు విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: