కొన్ని కొన్ని సార్లు తన విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ తో కూడా అటు బ్యాట్స్మెన్లను తికమక పెడుతూ ఉంటాడు. ఇక ఇటీవలే భారత టెస్టు జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అదే సమయంలో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇక ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ అత్యధిక వికెట్లు తీసిన రెండవ స్పిన్నర్ గా రికార్డు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ అరుదైన రికార్డు సాధించిన హర్భజన్ సింగ్ ను వెనక్కి నెట్టాడు రవిచంద్రన్ అశ్విన్.
కాగా ఇటీవలే ఈ విషయంపై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్ హర్భజన్ సింగ్ కి క్షమాపణలు చెప్పాడు. ఇటీవలే స్వదేశం లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్గా రికార్డు నెలకొల్పిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఉన్న హర్భజన్ సింగ్ ను వెనక్కు నెట్టాడు. అయితే చిన్నప్పుడు తాను క్రికెట్ ఆడుతున్న సమయంలో అచ్చం హర్బజన్ లాగే స్పిన్ బౌలింగ్ వేస్తున్నావు అంటూ తన సహచరులు తనను ఎగతాళి చేసే వారిని ఇక ఆ స్థాయి నుంచి వచ్చిన నేను ఏకంగా హర్భజన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టడం ఎంతో సంతోషంగా ఉందని.. ఇక మీ రికార్డును బద్దలు కొట్టినందుకు నన్ను క్షమించండి హర్భజన్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టగా ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి