ప్రస్తుతం భారత క్రికెట్లో ఉమేష్ యాదవ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎన్నో ఏళ్ల నుంచి భారత క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడు గా కొనసాగుతున్నాడు ఉమేష్ యాదవ్.  ఇక ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాడిగా ఇక ఎన్నో సార్లు భారత జట్టుకు విజయాన్ని అందించడంలో ఉమేష్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు అనే చెప్పాలి. అయితే  సాధారణంగా భారత జట్టులోకి కొత్త యువ ఆటగాళ్లు వస్తున్న సమయంలో ఇక సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో కి వెళ్ళిపోతారు.



 యువ ఆటగాళ్లు రోజురోజుకీ మరింత బాగా రాణిస్తూ ఉండటంతో అటు జట్టులో సీనియర్ ఆటగాళ్లకు చోటు కూడా దక్కడం చాలా కష్టం గానే మారిపోతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ఉమేష్ యాదవ్ కు జట్టులో స్థానం దక్కడం మాత్రం కాస్త కష్టంగానే మారిపోయింది. అయితే తాజాగా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకొచ్చాడు భారత స్టార్ ఆటగాడు ఉమేష్ యాదవ్.  తాను భారత జట్టులో మరో రెండు నుంచి మూడేళ్ల కొనసాగుతాను అంటూ భారత బౌలర్ ఉమేష్ యాదవ్ చెప్పుకొచ్చాడు.


 తన వయస్సు ఇప్పుడు 33 ఏళ్ల  మరో రెండు మూడేళ్ల తర్వాత యువకులు తన ప్లేస్ ని భర్తీ చేసే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తుది జట్టులో స్థానం దక్కించుకొని రాణించాలని ఆశతో ఉన్నాను అంటూ ఉమేష్ యాదవ్ తెలిపాడు. ఇక టెస్టు చాంపియన్షిప్ లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలన్నదే తన కోరిక అంటూ తెలిపాడు. నాలుగైదు టెస్ట్ మ్యాచ్లు ఉన్న సిరీస్ లో ఒక అయిదారుగురు పేసర్లు ఉంటే ఎంతో మేలు జరుగుతుందని మిగతా ఆటగాళ్లకు పనిభారం తగ్గుతుంది అంటూ ఉమేష్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత జట్టు ఫైనల్ లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: