టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఐదు సంవ‌త్స‌రాల సుధీర్ఘ విరామం అనంత‌రం ఈ రోజు నుంచి ప్రారంభ మ‌వుతోంది. వాస్త‌వంగా ఈ నెల 17 నుంచే 8 జ‌ట్ల మ‌ధ్య గ్రూప్ అర్హ‌త మ్యాచ్‌లు జ‌రిగాయి. రెండు గ్రూప్‌ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ల‌లో నాలుగు జ‌ట్లు ప్ర‌ధాన‌మైన సూప‌ర్ - 12 రౌండ్‌కు అర్హ‌త సాధించాయి. సూప‌ర్ 12 కు 8 జ‌ట్లు నేరుగా అర్హ‌త సాధించాయి. అర్హ‌త మ్యాచ్ ల నుంచి శ్రీలంక - న‌మీబియా - స్కాట్లాండ్ - బంగ్లాదేశ్ అర్హ‌త పొందాయి. శ‌నివారం నుంచి సూప‌ర్ 12 మ్యాచ్‌లు స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కో గ్రూపులో ఆరు జ‌ట్లు ఉన్నాయి. ప్ర‌తి జ‌ట్లు మిగిలిన జ‌ట్ల‌తో ఒక్కో మ్యాచ్ చొప్పున ఐదు మ్యాచ్‌లు ఆడ‌తాయి.

ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే 2007లో తొలి టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచింది. అప్ప‌టి నుంచి ఎన్ని సార్లు ప్ర‌పంచ‌క‌ప్‌లు జ‌రిగినా భార‌త్ మాత్రం గెల‌వ‌లేదు. చివ‌రి సారిగా 2016 లో టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ భార‌త్ లోనే జ‌రిగినా మ‌న జ‌ట్టు గెల‌వ‌లేదు. అయితే ఈ సారి మాత్రం టీం ఇండియా అన్ని విభాగాల్లోనూ ప‌టిష్టంగా ఉంది. ఇక సీనియ‌ర్ ఆట‌గాడు , మాజీ కెప్టెన్ ఎంఎస్‌. ధోనీ మెంటార్ గా ఉండి జ‌ట్టును ముందుకు న‌డిపి స్తుండ‌డం కూడా భార‌త్‌కు ప్ల‌స్ కానుంది.

ఇక ర్యాంకింగ్స్ ప‌రంగా భార‌త్ రెండో స్థానంలో ఉండ‌డం కూడా సానుకూల అంశం. జ‌ట్టులో రోహిత్‌, విరాట్‌, రాహుల్‌, పంత్‌, బుమ్రా లాంటి స్టార్లు , మ్యాచ్ విన్న‌ర్లు ఉండ‌డం కూడా చాలా ప్ల‌స్ కానుంది. ఇక ఇదే కోహ్లీకి చివ‌రి 20 ప్ర‌పంచ క‌ప్ కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రపంచ క‌ప్ లో ఆడిన 33 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో టీం ఇండియాకు మంచి రికార్డే ఉంది. ఇక కోహ్లీకి ఇదే చివ‌రి ప్ర‌పంచ‌క‌ప్ అని.. ఈ ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత కోహ్లీ రిటైర్ అవుతాడ‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే మ‌నోడికి ఈ క‌ప్ ను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఆట‌గాళ్లు క‌సితో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: