యూఏఈ లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. క్వాలిఫైయర్ మ్యాచ్ ల నుండి మొదలైన ఈ పొట్టి క్రికెట్ సమరం సూపర్ 12 లో ప్రతి ఒక్క మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది. సెమీఫైనల్ కి వెళ్లే జట్లు ఏవి అనేది ఇంకా ఒక అంచనాకు రాలేని పరిస్థితి. గతంలో ఛాంపియన్ లుగా నిలిచినా జట్లు సైతం పూర్తిగా తేలిపోతున్నాయి. అందుకే ఇంకా కొన్ని మ్యాచ్ లు జరిగితే కానీ సెమీఫైనల్ జట్లపై ఒక అంచనాకు రాలేము. టైటిల్ ఫేవరెట్ అనుకున్న టీమిండియా సైతం మొదటి మ్యాచ్ లో చాలా దారుణంగా పరాజయం చెందింది. ఇక రెండు వరల్డ్ కప్ లను సాధించిన వెస్ట్ ఇండీస్ జట్టు కూడా పేలవమైన ఆటతీరును చూపుతోంది.

ఇదిలా ఉంటే ఈ రోజు ఇంకాసేపట్లో గ్రూప్ 2 నుండి జరగబోయే మ్యాచ్ ఉత్కంఠగా ఉండనుందని తెలుస్తోంది. వరుస విజయాలతో ఊపుమీదున్న పాకిస్తాన్ ను పసికూన ఆఫ్ఘన్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఆఫ్ఘన్ కు చాలా ముఖ్యం. ఇందులో గెలిస్తే సెమీస్ రేస్ లో ఉంటుంది. కాగా ఈ మ్యాచ్ గెలిచి సెమీఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవడానికి పాక్ చూస్తోంది. అయితే మొన్ననే స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి చిత్తు చిత్తుగా ఓడించింది.

ఇదే ఆత్మవిశ్వాసంతో ఈ రోజు బరిలోకి దిగుతోంది. ఆఫ్ఘన్ జట్టు నిండా ఆల్ రౌండర్ లతో పటిష్టంగా ఉంది. కాబట్టి పాక్ ను ఓడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాక్ కూడా ఆఫ్ఘన్ ను ఈజీగా తీసుకోకపోవచ్చు. మరి ఏమైనా సంచలనం చూస్తామా లేదా ఎప్పటిలాగే పాక్ జోరు కొనసాగుతుందా? లేదా పాక్ జోరుకు ఆఫ్ఘన్ అడ్డుకట్ట వేస్తుందా తెలియాలంటే మరి కొంత సేపు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: