వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్.. ఈ పేరు చెబితే చాలు క్రికెట్ ప్రేక్షకులందరూ లో కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. కేవలం వెస్టిండీస్ క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్ గేల్ ను అభిమానించే ప్రేక్షకులు కోట్ల లోనే ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే తన ఆటతో ఏకంగా యూనివర్సల్ బాస్ గా మారిపోయాడు. వెస్టిండీస్ క్రికెట్ లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి దిగ్గజ క్రికెటర్ గా అవతారమెత్తాడు.  క్రిస్ గేల్  బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఎంత దిగ్గజ బౌలర్లకు  అయినా సరే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసం అలాంటిది.


 క్రిస్ గేల్ ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు. అంటే చాలు అటు స్కోర్ బోర్డ్ సైతం పరుగులు పెట్టి అలసిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రిస్ గేల్ కెరియర్లో సింగిల్స్ అనే మాటే ఉండదు.. వచ్చిన ప్రతీ బంతిని బౌండరీ దాటించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ దిగ్గజ ఆటగాడు. ఎన్నోసార్లు ఒంటిచేత్తో వెస్టిండీస్ జట్టుకు విజయాన్ని అందించిన ఘనత కూడా క్రిస్ గేల్ సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగా 40 ఏళ్లు వచ్చాయంటే చాలు క్రికెట్ కెరియర్ కి ఆటగాళ్లు స్వస్తి పలుకుతూ ఉంటారు. కానీ క్రిస్ గేల్ 40 ఏళ్ళు దాటిపోతున్నా ఇప్పటికీ ఇంకా యువ ఆటగాళ్లకు పోటీ చేస్తూ వస్తున్నాడు.


 గత కొంత కాలం నుంచి ఈ సీనియర్ క్రికెటర్ ఫామ్ను కోల్పోయి తెగ ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో కూడా క్రిస్ గేల్ పెద్దగా రాణించలేకపోయాడు. అయినప్పటికీ అతని పై నమ్మకంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు యువకుల ఫార్మాట్  టీ20 ప్రపంచ కప్ లో ఎంపిక చేసింది. కానీ టి20 ప్రపంచ కప్ లో కూడా క్రిస్ గేల్ అంతగా రాణించలేదు. దీంతో టి20 క్రికెట్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ కెరీర్ ముగిసిపోయింది అని టాక్ వినిపిస్తోంది.టి20 ప్రపంచకప్ లో వరుసగా 13,12, 4,1 పరుగులు  మాత్రమే చేశాడు క్రిస్ గేల్. మొత్తంగా నాలుగు మ్యాచ్ లలో కలిపి 30 పరుగులు చేశాడు. దీంతో ఇక మరికొన్ని రోజుల్లో రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అంటూ ప్రస్తుతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: