ముఖ్యంగా ప్రస్తుతం జట్టులో సీనియర్ ప్లేయర్లు గా కొనసాగుతున్న వారికి కాస్త విశ్రాంతి ఇచ్చి.. యువ ఆటగాళ్లకు జట్టులోకి తీసుకోవడం వల్ల వారికి అనుభవంతో పాటు ఎన్నో మెళుకువలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా వరుసగా రెండు మ్యాచ్లలో విఫలం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇక రానున్న రోజుల్లో అటు బిసిసిఐ కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి సిద్ధం అయింది అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక ఇటీవలే టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ ఈ విషయం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 2022 టి20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఐదుగురు యువ ఆటగాళ్ల పై దృష్టి పెడితే ఎంతో బాగుంటుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్.రాహుల్, రూతురాజ్ గైక్వాడ్ లను వచ్చే టి20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ కి ముందు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ యువ ఆటగాళ్ల టీమిండియా భవిష్యత్ అని.. ఇక వీరు వరల్డ్ కప్ తీసుకువస్తారు ఆశాభావం వ్యక్తం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి