బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయింది అంతే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా పండగే అని చెప్పాలి. ప్రతిసారి ఐపీఎల్ లో ఎనిమిది జట్లు రంగంలోకి దిగి హోరాహోరీగా పోటీ పడుతూ ఉంటాయి. అయితే ఈసారి ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ డబుల్ కాబోతుంది. ఏకంగా రెండు జట్లు ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయ్. దీంతో ఇక ఈ సారి ఐపీఎల్ స్కోరు ఎంత రసవత్తరంగా మారబోతుంది అనేదానిపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇక ఐపీఎల్ కోసం మెగా వేలం నిర్వహించాలని అటు బిసిసిఐ ప్లాన్ చేసింది. ఇక అంతకు ముందు ఇక 8 జట్ల ఫ్రాంచైజీలు కూడా తమతో పాటు ఉంచుకునే ఆటగాళ్ల వివరాలు సమర్పించాల్సి ఉంది.


 దీంతో ఏ జట్లు ఏ ఆటగాళ్లను తమతో రిటైన్ చేసుకోబోతుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులందరికీ కూడా శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనీని మూడేళ్లపాటు రిటైన్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ మాత్రమే ఆడి ధోని రిటైర్ అవ్వబోతున్నట్లు ఎంతో మంది భావించారు. కానీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఏకంగా ధోనీని మూడేళ్లపాటు రీటైన్ చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుండటంతో ఇక ధోనీ మూడేళ్లపాటు ఐపీఎల్ ఆడబోతున్నాడు అనే ఆనందంలో మునిగిపోయారు అభిమానులు.


 ధోనీతో పాటు రూతురాజ్ గైక్వాడ్,రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ లేదా శ్యామ్ కరణ్ లను తమతోపాటు రిటైన్ చేసుకునేందుకు సిద్ధం అవుతోందట చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఎంతోమంది స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ అందరి చూపు మాత్రం కేవలం మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంటుంది. ఇక ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని అన్న విధంగా ప్రస్తుతం మారిపోయింది. దీంతో ఇక ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడేళ్లపాటు రిటైన్ చేసుకున్నట్లు  టాక్ వినిపిస్తుండటంతో ఇది ఎంతవరకు నిజం అని తెలుసుకోవడానికి అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెతికేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: