ఇటీవల సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్ ఓడిపోయింది. దీంతో భారత అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే టెస్టు సిరీస్లో ఓడిపోయిన 24 గంటల వ్యవధిలో తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించి షాకిచ్చాడు. ఇప్పటికే టీ20 వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పకున్న విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఒక సాదాసీదా ఆటగాడిగానే జట్టులో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ తర్వాత టెస్ట్ కెప్టెన్సీ చేపట్టబోయేది ఎవరు అన్న చర్చ ప్రస్తుతం ఊపందుకుంది. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ నే టెస్ట్ ఫార్మట్ కి కూడా కెప్టెన్ అవబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.


 ఈ క్రమంలోనే స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఫిట్నెస్  దృశ్య  రోహిత్ శర్మకు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకపోవటం ఎంతో మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలి కాలంలో వరుసగా గాయాల బారిన పడుతున్న రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడు. ఇక రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని కాకుండా ప్రతి మ్యాచ్ కు అందుబాటులో ఉండే ఆటగాడిని కెప్టెన్ గా నియమించాల్సిన అవసరం ఉంది అంటూమాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదే విషయంపై మాజీ కోచ్ రావిశాస్త్రి స్పందిస్తూ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రోహిత్ శర్మ కు ఎందుకు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించ కూడదు అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే టెస్ట్ ఫార్మాట్ కి కూడా అతడినే ఎందుకు పూర్తిస్థాయి కెప్టెన్గా  ఎందుకు నిర్మించకూడదు ఇప్పటికే వైస్ కెప్టెన్ గా ఉన్న అతనికి కెప్టెన్ గా ఎందుకు ప్రమోషన్ ఇవ్వకూడదు అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఒక కోచ్గా రోహిత్ శర్మ ఆట పట్ల ఎంతో గర్వపడుతున్నాను. ఆట పట్ల అతని దృక్పథం ఎంతో గొప్పగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక రిషబ్ పంత్ కూడా గొప్ప ఆటగాడు అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అందుకే కెప్టెన్సీ గురించి చర్చ జరిగినప్పుడు అతని పేరు కూడా తెర మీదికి వస్తుంది అని  అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: