భారత క్రికెట్ లో కీలకమైన ఆల్రౌండర్గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా గత కొంత కాలం నుంచి ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ లో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేలవమైన ప్రదర్శన చేయడంతో అతన్ని జట్టు నుంచి పక్కనపెట్టేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే అప్పటినుంచి క్రికెట్కు దూరంగానే ఉంటున్నాడు హార్దిక్ పాండ్యా. ఇక ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది.



 ఇకపోతే భారత క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు హార్దిక్ పాండ్యా. మహేంద్రసింగ్ ధోని లేకపోతే నేనులేను అంటూ హార్దిక్ పాండ్యా వ్యాఖ్యానించాడు.  ధోని ప్రోత్సాహం లేకపోయి ఉంటే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే నా కెరీర్ ముగిసిపోయేది అంటూ వ్యాఖ్యానించాడు. భారత జట్టులోని ప్రతి ఆటగాడు నుంచి ఏదో ఒక విషయం నేర్చుకున్నాను ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.


 ఒక ముడిపదార్థంగా భారత జట్టులోకి అడుగుపెట్టిన నన్ను సాన పెట్టి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేలా చేసి ఎంతగానో ప్రోత్సాహం అందించాడు మహేంద్రసింగ్ ధోని.  మైదానంలో  ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశాన్ని కల్పించాడు. ఒక ఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను.  నేను వేసిన తొలి ఓవర్లో 22 పరుగులు ఇచ్చాను. దీంతో ఇక నా తొలి మ్యాచ్ చివరి మ్యాచ్ అవుతుంది అని అనుకున్నాను. కానీ ఊహించని రీతిలో ధోనీ మరో ఓవర్ వేసేందుకు నాకు బంతిని అందించాడు. ఇక అప్పటి నుంచి నా ఆటతీరు మొత్తం మారిపోయింది. ఒకే ఘటనతో ఎన్నో విషయాలను నేర్చుకో గలిగాను ఇక మ్యాచ్ జరుగుతున్నప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆటగాళ్లకు ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు ధోని. అతని ప్రోత్సాహం వల్ల ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో రాణించగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు హార్దిక్ పాండ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: