క్రికెట్ లో ప్రతి ఒక్క టీమ్ కి ఒక లక్ష్యం ఉంటుంది. కనీసం ఒక్క సారైనా ప్రపంచ కప్ గెలవాలని, గెలవడం అంటే వరల్డ్ లో బెస్ట్ టీమ్ గా అవతరించినట్లు లెక్క. అయితే ఇది అంత సులభం కాదు. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోగా కేవలం రెండు జట్లు మాత్రం ఇప్పటి వరకు ప్రపంచ కప్ ను ముద్దాడలేకపోయాయి. వాటిలో ఒకటి న్యూజిలాండ్ మరొకటి సౌత్ ఆఫ్రికా. ఇదిలా ఉంటే ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ వేదికగా జనవరి 14 నుండి 2022 అండర్ 19 వన్ డే వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది కూడా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.

అనూహ్యంగా మొట్ట మొదటి సారిగా సెమీఫైనల్ కు చేరిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో గత రాత్రి ఓటమి పాలయింది. స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో విఫలం అయిన ఆఫ్ఘన్ ఇంగ్లండ్ ను ఫైనల్ కు చేర్చింది. ఈ రోజు రెండవ సెమీఫైనల్ ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరగనుంది. అయితే రెండు జట్లు సమతూకంగా ఉన్నాయి. విజయం ఎవరిని అయినా వరించవచ్చు. అయితే ఈ రోజున ఎవరు అయితే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారో వారే విజయానికి అర్హులు అవుతారు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పైన ఇండియాకు మంచి రికార్డ్ ఉంది. కానీ ప్రతి సారీ అనుకున్నదే జరుగుతుంది అని చెప్పలేము.

గతంలో 2018 మరియు 2020 లో ఆస్ట్రేలియాను ఓడించారు. కానీ ఈ సారి అంత సులభం కాబోదని క్రికెట్ ప్రముఖులు అంటున్నారు. ఇండియా టీమ్ లో దాదాపు కుర్రాళ్ళు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ యశ్ దుల్ నేతృత్వంలో వరుసగా అయిదవసారి ఇండియా ఫైనల్ చేరుతుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాలి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఢీ కొట్టాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: