అబ్బబ్బా  ఏం ఆడుతున్నారు.. ప్రతి మ్యాచ్ లో కూడా అదే జోరు.. ప్రత్యర్థులను చిత్తు చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.. బ్యాటింగ్ బౌలింగ్ అనే తేడా లేదు.. అన్ని విభాగాల్లోనూ సత్తా చాటుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం సొంత గడ్డపై జరుగుతున్న వన్డే టి20 సిరీస్ లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.


ఇక ఇటీవలే వెస్టిండీస్ భారత్ మధ్య రెండవ  టి20 సిరీస్ కూడా ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అ యితే వన్డే సిరీస్ సీన్  టి 20 సిరీస్ లో కూడా రిపీట్ చెయ్యాలని అనుకుంటుంది టీమిండియా.  వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే ఇక కనీసం టి20 సిరీస్ లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది వెస్టిండీస్ జట్టు. అయితే ఇప్పటికే జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో భారీ విజయాన్ని సాధించింది టీమిండియా.  ఇక వెస్టిండీస్ భారత్ మధ్య నేడు రెండో టి20 మ్యాచ్ జరగబోతోంది.




 కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే 1-0 తేడాతో  ఆధిక్యంలో కొనసాగుతున్న టీమిండియా ఇక రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈడెన్ గార్డెన్ పిచ్ బౌలింగ్కు అనుకూలిస్తుందని  అటు నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ దక్కించుకోవాలని టీమిండియా అనుకుంటూ ఉంటే ఇక రెండవ టీ 20 మ్యాచ్లో విజయం సాధించి సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని అనుకుంటుంది వెస్టిండీస్ జట్టు. ఏం జరుగుతుంది అన్నది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: