మరో రెండు రోజుల్లో మహిళల ప్రపంచ కప్ సందడి స్టార్ట్ కానుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 4 నుండి మహిళల వన్ డే ప్రపంచ కప్ జరగనుంది. మహిళల ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు 11 జరిగాయి, కాగా ఇప్పుడు జరగనున్న 12 వ ప్రపంచ కప్ కు న్యూజిలాండ్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. వాటిలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ర్యాంకింగ్ పరంగా తక్కువలో ఉన్న శ్రీలంక, ఐర్లాండ్ మరియు థాయిలాండ్ జట్లు అర్హత సాదించలేకపోయాయి.

వాస్తవానికి ఈ టోర్నీ గత సంవత్సరమే జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ప్రపంచమే స్తంభించిపోయింది, అందుకే ఇప్పుడు జరపడానికి నిర్ణయించారు. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ ఆతిధ్య న్యూజిలాండ్ వెస్ట్ ఇండీస్ ను ఢీ కొట్టనుంది. ఇక ఈ వరల్డ్ కప్ ఫార్మాట్ విషయానికి వస్తే ప్రతి టీమ్ మరో టీమ్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అలా పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. లీగ్ మ్యాచ్ లు మార్చి 28 వ తేదీ వరకు జరగనున్నాయి. సెమీఫైనల్ మ్యాచ్ లు 30 మరియు 31 వ తేదీలలో జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3 వ తేదీ జరుగుతుంది. సెమిఫైనల్ మరియు ఫైనల్  మ్యాచ్ లకు రిజర్వుడే ఉండనుంది.

మరి ఈ ప్రపంచ కప్ ను ఎవరు గెలుచుకోనున్నారో తెలియాలంటే ఇంకా నెల రోజుల వరకు ఆగాల్సిందే. అయితే ఎక్కువ అవకాశాలు మాత్రం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్లకు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కానీ భారత్ జట్టుకు అవకాశాలు లేవని చెప్పలేని పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: