ప్రస్తుతం టీమిండియా లో కీలక బౌలర్ గా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్ ప్రస్థానం ఎంతో ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. అతను ఒక సాదా సీదా మధ్యతరగతి కుటుంబం స్థాయి నుంచి టీమిండియా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా గౌరవించే బౌలర్ స్థాయికి ఎదగడానికి ఎంతగానో కష్టపడ్డాడో దాదాపు అందరికీ తెలుసు. ఐపీఎల్లో అవకాశం దక్కించుకుని అక్కడ తన ప్రతిభ చాటి ఆ తర్వాత భారత అంతర్జాతీయ జట్టులో కూడా అవకాశం దక్కించుకున్నాడు మహమ్మద్ సిరాజ్.


 ఇక భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు అనీ అందరూ ఆనంద పడుతున్న సమయంలో అతని జీవితంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఇండియా తో కలిసి మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో తనకు చిన్నప్పటి నుంచి వెన్నుదన్నుగా నిలిచి ఇక అతడు ఈ స్థాయికి రావడానికి కారణమైన తండ్రి మరణించాడనే వార్త అతను చెవిన పడింది. దీంతో గుండె బద్దలయ్యింది. ఆ సమయంలో తండ్రి కోరిక తీర్చడం ముఖ్యం అనుకున్న సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటన నుంచి భారత్కు తిరిగి రాలేదు.


 ఇక ఆ సమయంలో సిరాజ్ ఎంతగానో నిరాశతో కుంగిపోయాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇలా తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సమయంలో జట్టు తనకు ఎంతగానో అండగా నిలిచింది అంటూ చెప్పుకొచ్చాడు సిరాజ్. ముఖ్యంగా హెడ్ కోచ్ రావిశాస్త్రి తనకు మద్దతు ఇచ్చాడు అంటూ పేర్కొన్నాడు.. నా తండ్రి చనిపోయినప్పుడు రవిశాస్త్రి నా దగ్గరికి వచ్చి సిరాజ్.. నీ తండ్రి నువ్వు టెస్టులో ఐదు వికెట్లు చేస్తే చూడాలని కోరుకు న్నాడు. నువ్ అది సాధించగలవు అని నాకు చెప్పాడు అంటూ సిరాజ్  గుర్తుచేసుకున్నాడు. ఇక రవిశాస్త్రి అలా చెప్పడంతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను.. ఇక తండ్రి మరణం తర్వాత ఎంతో నిరాశ లో ఉన్నాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిరాశా నిస్పృహలు నన్ను కమ్మేశాయ్ ఏం చేయాలో తోచలేదు అంటూ చెప్పుకొచ్చాడు సిరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: