ఈ రోజు తొలిసారి ఐపీఎల్ సీజన్ 15 తోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలోనూ తనదైన ఆటతీరుతో విజయాల్ని నమోదు చేసుకుని ముందుకు దూసుకువెళుతోంది. ఈ రోజు తన నాలుగవ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఢీకొడుతోంది. మొదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో విలియమ్సన్ సేన విజయమే ప్రధమ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ మూడు మ్యాచ్ లు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రం గెలుపొంది, మిగిలిన రెండు మ్యాచ్ లను పోగొట్టుకుంది. అయితే గత మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చిన సన్ రైజర్స్ అదే ఫామ్ ను కొనసాగించాలని చూస్తోంది.

అయితే దూకుడు మీదున్న గుజరాత్ ను ఓడించడం అంత తేలికైన విషయం అయితే కాదు. గత మ్యాచ్ లో ఏ విధంగా అయితే అభిషేక్ శర్మ మరియు విలియమ్సన్ చూసుకుంటూ ఆది లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారో ఈ మ్యాచ్ లోనూ అదే విధంగా వికెట్లను కాపాడుకుంటూ ఆడితే సులభంగా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆడుతున్న పిచ్ బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తోంది. కాబట్టి మంచి ఊపుమీదున్న గుజరాత్ ను 160 నుండి 170 పరుగుల లోపు నియంత్రించగలిగితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ స్కోర్ ను చేధించాలి అన్నా కూడా బలమైన గుజరాత బౌలింగ్ అటాక్ ను తట్టుకుని పరుగులు చేయడం ఏమంత ఈజీ కాదు.

మరి విలియమ్సన్ సేన ఏ విధంగా గుజరాత్ ను కట్టడి చేసి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అయితే ఇప్పటి వరకు తమ మెరుపులు చూపించని పూరన్, విలియమ్సన్, మార్ క్రామ్ లు ఆడితే సన్ రైజర్స్ కు ఎదురు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: