ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొనసాగుతున్నాడు. ధోని లాంటి దిగ్గజ క్రికెటర్ వికెట్ పడగొట్టాలి అని అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు కలలుకంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో అవకాశం దక్కించుకునీ ఈ కలను నిజం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకవేళ అనుకున్నట్లుగానే ధోని వికెట్ పడితే మాత్రం క్రికెటర్ల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి.
ఇప్పుడు యువ స్పిన్నర్ రాహుల్ చహర్ కూడా ఇదే చెబుతున్నాడు 2020 ఐపీఎల్ సీజన్ లో ధోని వికెట్ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అంటూ రాహుల్ చహర్ తెలిపాడు. ధోని దిగ్గజ ఆటగాడు.. నేను 2020 ఐపీఎల్ సీజన్ లో ధోని ని మొదటిసారి అవుట్ చేశాను. ఇక ఆ క్షణంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను మాటల్లో వర్ణించలేను. అది ఒక మరిచిపోలేని జ్ఞాపకం. ధోనీ క్రీజులో ఉన్నాడు అంటే బౌలర్ ఎప్పుడు ఆందోళనకరంగానే ఉంటాడు.. ఎప్పుడైతే ధోని అవుట్ అవుతాడో అప్పుడు కాస్త ఫ్రీగా ఫీల్ అవుతాడు. నేను కూడా అంతే అంటూ రాహుల్ చహర్ చెప్పుకొచ్చాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి