సాధారణంగా  క్రికెట్ లో సెంచరీ చేసి అదరగొట్టారు అనేది ప్రతి ఆటగాడికి కోరిక ఉంటుంది  ఇలా సెంచరీ సాధించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమదైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంటారు అన్న విషయం తెల్సిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలాంటి సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇకపోతే అటు టీమిండియా బ్యాట్స్మెన్ ప్రస్తుతం ఐపీఎల్లో లక్నో కెప్టెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ కూడా సెంచరీ చేసినప్పుడు కాస్త కొత్తగా విచిత్రంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తూ ఉంటాం.


 ఇకపోతే ఇటీవలె ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 103 పరుగులు చేసి శతకంతో అదరగొట్టాడు కె.ఎల్.రాహుల్. దీంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇలా శతకం బాదిన సమయంలో సరైన రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే కె.ఎల్.రాహుల్ చెవులు మూసుకొని సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చేసాడు. ఇక ఇప్పుడు కూడా అదే చేశాడు. పరుగులు పూర్తి కాగానే బ్యాడ్ కింద పెట్టి రెండు చేతులతో తన చెవులు మూసుకొని కళ్ళు మూసుకుని కాసేపు మౌనంగా ఉన్నాడు. అయితే ఇదే విషయంపై మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఒక క్రీడా ఛానల్తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడూ.


కేఎల్ రాహుల్ సెలబ్రేషన్స్ నాకు ఏమాత్రం అర్థం కాలేదు. కేఎల్ రాహుల్ చెవులు మూసుకుని బయటి నుంచి వచ్చే శబ్దాలను వినకుండా చేస్తున్నాడు   అయితే సెంచరీ చేసినప్పుడు ప్రజల నుంచి వచ్చే అభినందనలు గౌరవాన్ని స్వీకరించాలి. కేవలం సింగిల్ డిజిట్ స్కోర్ కి మాత్రమే అవుట్ అయినప్పుడు అలా చెవులు మూసుకోవడం చేయాలి. సెంచరీ చేసినప్పుడు కాదు ఇలా సెంచరీ చేసినప్పుడు అభిమానుల కేరింతలు సంతోషాన్ని ఆస్వాదించాలి అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే అతను ఫామ్ లో లేనప్పుడు విమర్శలు చేసిన వారికి ఇలా చెవులు మూసుకొని ధీటుగా సమాధానం ఇస్తాడు అంటూ ఒక ప్రచారం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: