విరాట్ కోహ్లీ మళ్ళీ మునుపటి ఫామ్ లోకి రావాలని పరుగుల వరద పారించాలని.. ప్రస్తుతం అందరూ కోరుకుంటున్నారు. అయితే గత కొంత కాలం నుంచి పేలవమైన ఫాంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ టీ20 మ్యాచ్ లో కూడా నిరాశ పరుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య బ్యాటింగ్ కి రావడం చివరికి తక్కువ పరుగులకే నిరాశ పరచడం చేస్తున్నాడు. ఐపీఎల్లో గత రెండు మూడు మ్యాచ్ ల నుంచి అయితే వరుసగా డకౌట్ అవుతూ ఉండటం గమనార్హం. దీంతో కోహ్లీ ఫామ్ లోకి రావాలని ఎంతోమంది అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. కేవలం  అభిమానులే కాదు అటు పాకిస్థాన్ క్రికెటర్ సైతం ఇప్పుడు ఇదే కోరుకున్నాడు.


 పాకిస్తాన్ జట్టులో వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్గా మహమ్మద్ రిజ్వాన్ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  కెప్టెన్ బాబర్ అజాం తో కలిసి మహమ్మద్ రిజ్వాన్ ఎప్పుడూ మంచి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పుతాడు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావాలి అంటూ కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.  ఇందుకోసం ప్రార్థిస్తాను అంటూ తెలిపాడు.  కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో భాగంగా 12 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ 216 పరుగులు మాత్రమే చేశాడు.


 విరాట్ కోహ్లీ టీ20 కెరియర్ లోనే ఇది అత్యంత పేలవమైన ప్రదర్శన అని చెప్పాలి. వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా పేరున్న విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ప్రదర్శనలు చూసి ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ ఛాంపియన్. అయితే ఇప్పుడు సరిగ్గా ఆడ లేక పోతున్నాడూ. అతను బాగా రాణించాలని నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే అతడు చాలా కష్టపడే ఆటగాడు. ఆటగాళ్లు కొన్ని సార్లు క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తర్వాత తిరిగి పుంజుకుంటారు. క్రికెట్ లో ఇలా ఎంతోమంది ఆటగాళ్లు పుంజుకొని సెంచరీలు కూడా కొట్టారు. ఇలా క్రికెట్ లో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని కోసం నేను దేవుడిని మోక్కడం మాత్రమే చేయగలను. కోహ్లీ మళ్లీ ఫాంలోకి వస్తాడని ఆశిస్తున్నాను అంటు మొహమ్మద్ రిజ్వాన్ తన అభిమానాన్ని చాటుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: