ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇటీవల కాలంలో అంపైరింగ్ తప్పిదాలు ఎంత మంది ఆటగాళ్ల పాలిట శాపంగా మారి పోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఫీల్డ్ అంపైర్లు మాత్రమే కాదు థర్డ్ అంపైర్లు కూడా తప్పుడు నిర్ణయాల కారణంగా మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేశారు.  అంపైర్లు తప్పుడు నిర్ణయాల పట్ల సోషల్ మీడియాలో అభిమానులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది కీలక ఆటగాళ్లు కూడా నిరాశ చెందారు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవల గుజరాత్ టైటాన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మరోసారి అంపైరింగ్ తప్పిదం పెద్ద వివాదంగా మారిపోయింది. ఏకంగా థర్డ్ అంపైర్ సైతం తప్పుడు నిర్ణయం కారణంగా మ్యాచ్ కీలక మలుపు తిరిగింది అనే చెప్పాలి. గుజరాత్ జట్టులో కొనసాగుతూ ఉన్నాడు మాథ్యూ వేడ్. ఈ క్రమంలోనే సరైన ప్రదర్శన చేయడం లేదు అనుకుని అతని పక్కన పెట్టారు. ఇటీవలే జరిగిన మ్యాచ్లో మళ్లీ జట్టులో స్థానం కల్పించారు. ఈసారి ఎలాగైనా తనని తాను నిరూపించుకోవాలనే కసితో ఉన్నాడు మాథ్యూ వేడ్.


 ఇలాంటి సమయంలో 11 బంతుల్లో 1 సిక్సర్, 2ఫోర్లతో మంచి టచ్ లో కనిపించాడు. ఇక అలాంటి సమయంలోనే మ్యాక్స్వెల్ సంధించిన బంతికి స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఎల్బీడబ్ల్యు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో వెంటనే రివ్యూ కి వెళ్ళాడు మాథ్యూ వేడ్.  అయితే రివ్యూ లో భాగంగా అటు బంతి ముందుగా బ్యాట్ కీ తాకినట్టు కనిపించింది  కానీ అటు ఆల్ట్రా ఏడ్జ్ సౌండ్ లో మాత్రం ఎలాంటి స్పైక్ రాలేదు అని చెప్పాలి. దీంతో ఏకంగా థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ గా ప్రకటించాడు. ఈ విషయంపై స్పందించిన సచిన్ టెండూల్కర్ అది దురదృష్టకరం.. బంతి బ్యాట్ కు తగిలుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. అది అంపైర్ తప్పిదమే అంటూ సచిన్ టెండూల్కర్ అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: