ప్రస్తుతం టీమిండియా స్వదేశంలో అటు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ ఆడుతోంది. ఈ టీ20 సిరీస్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్ లలో కూడా టీమిండియాకు చేదు అనుభవమే ఎదురైంది. మొదటి మ్యాచులో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా ఇక రెండవ మ్యాచ్ లో పుంజుకుంటుంది అని అందరూ అనుకున్నారు. రెండవ మ్యాచ్ లో అంతకుమించిన పేలవ ప్రదర్శన చేసి మరోసారి నిరాశపరిచింది. మొదటి మ్యాచ్లో 211 పరుగుల భారీ స్కోరు చేసిన టీం ఇండియా.. ఇక రెండవ మ్యాచ్ కేవలం 147 పరుగులు మాత్రమే అతి కష్టం మీద చేయగలిగింది.


 అయితే అటు టీం ఇండియా బౌలింగ్ విభాగం సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మెన్ లపై  ఎక్కడ ప్రభావం చూపలేక పోతున్నారు అని చెప్పాలి. అయితే రెండో మ్యాచ్ లో 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టును పవర్ ప్లే లోనే మూడు వికెట్లు పడగొట్టి దెబ్బ కొట్టాడు భువనేశ్వర్ కుమార్. అయితే మిగతా బౌలర్లు మాత్రం తీవ్రంగా విఫలం అయ్యారు అని చెప్పాలి. చాహల్, హార్థిక్ పాండ్య, అక్షర్ పటేల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇదే విషయం పై స్పందించిన సునీల్ గావస్కర్.. భారత జట్టులో భువనేశ్వర్ కుమార్ తప్ప వికెట్లు తీసే మరో బౌలర్ కనిపించడం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడంటూ మెచ్చుకున్నాడు. ఇండియా ఓటమికి బౌలర్ల వైఫల్యమే కారణం అంటూ తెలిపాడు.



 సొంత గడ్డపై టీమిండియా వరుసగా పరాజయాలు పాలు అవుతూ ఉండటం మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయ్ అని చెప్పాలి. ఇక యువ ఆటగాడు రిషబ్ పంత్  సమర్ధవంతంగా జట్టును ముందుకు నడిపించలేకపోతున్నాడు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే కనీసం మూడో మ్యాచ్లోనైనా గెలిచి అటు సిరీస్ ఆశయాలను ఇంకా సజీవంగా ఉంచుకోవాలనీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది ఇండియా. మూడో మ్యాచ్ లో ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: