ఇటీవలే ముల్తాన్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్ లో అయిన పుంజుకుని పరువు నిలబెట్టుకుంటోంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా పేలవ ప్రదర్శనతో 53 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి చవిచూసింది. తద్వారా పాకిస్థాన్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది వెస్టిండీస్. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్తో జరిగినా వన్డే సిరీస్లో ఓటమి తనను ఎంతగానో నిరాశపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్తో జరిగే వన్డే సిరీస్లో చేసిన తప్పులను గ్రహించి ఇక ఆ తప్పులను సరిదిద్దుకుని బంగ్లాదేశ్ లో జరిగే సిరీస్ లలో మంచి ప్రదర్శన చేస్తాను అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు నికోలస్ పూరన్. ఇకపోతే ఇటీవల పాకిస్థాన్ పర్యటన ముగించుకున్న వెస్టిండీస్ జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు మూడు టీ20 లు మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే జూన్ 16వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. . ఇక పాకిస్తాన్ తో వన్డే సిరీస్ లో తీవ్రంగా నిరాశపరిచిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్లో జరగబోయే వరుసగా సిరీస్ లలో అయిన సత్తా చాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి