వచ్చే ఏడాది నుంచి ఆప్రో ఆసియా కప్ ప్రారంభించే ప్రయత్నం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ భారత్ జట్ల ఆటగాళ్లు ఓకే టీం లో కనిపించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇలా భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు కలిసి ఆడారు కూడా. 2012 - 2013 లో భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అదే చివరిది అని చెప్పాలి. అయితే 2005, 2007లో రెండు సార్లు అప్రో ఆసియా కప్ నిర్వహించారు. కానీ ప్రస్తుత రాజకీయ సమస్యల కారణంగా ఈ టోర్నమెంట్ వాయిదా పడింది అని చెప్పాలి. ఇన్నేళ్ల తరువాత ఇక అప్పుడు ఆప్రో ఆసియా కప్ ను పునః ప్రారంభించాలని సన్నాహాలు జరుగుతున్నాయట.
ఇదే జరిగితే భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు ఒక జట్టుగా ఆడే అవకాశంఉంది. అయితే గతంలో భారత్కు చెందిన రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్థాన్కు చెందిన షోయబ్ మాలిక్, షాహిద్ ఆఫ్రిది లాంటి స్టార్ ప్లేయర్లు ఏకంగా ఆసియా జట్టు తరఫున ఓకే జట్టుతో కలిసి ఆడారు. దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వే ఆటగాళ్లు ఆప్రో జట్టు తరఫున ఆడారు. 2023 సంవత్సరంలో ఇక ఎప్పుడో నిలిచిపోయిన ఈ టోర్నీ మళ్లీ పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. బీసీసీఐతోపాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా దీనిపై కసరత్తు చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి