గత కొంతకాలం నుంచి ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయినా ఆటగాడు విరాట్ కోహ్లీ. కారణం ఒకప్పుడు పరుగుల దాహం తో ప్రతి మ్యాచ్లో కూడా భారీ పరుగులు చేస్తూ జట్టుకు విజయాన్ని అందించడమే కాదు మరోవైపు ఎన్నో రికార్డులను కూడా కొల్లగొట్టాడు విరాట్ కోహ్లీ. ఇక ఎన్ని పరుగులు చేసిన దాహం తీరలేదు అన్నట్లుగానే ప్రతి మ్యాచ్లో కనిపిస్తూ ఉండేవాడు. అందుకే అతని అభిమానులు అందరూ కూడా పరుగుల యంత్రం అని పిలవడం మొదలు పెట్టారు. అదే సమయంలో అతను సాధించిన రికార్డులు చూసి రికార్డులకు రారాజు అంటూ మరో ముద్దు పేరు కూడా పెట్టేశారు.



 కొన్నేళ్ల  పాటు ప్రపంచ క్రికెట్లో 3 ఫార్మాట్ లలో కూడా అత్యుత్తమ ఆటగాడుగా అగ్రస్థానంలో కొనసాగిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. దాదాపు గత మూడేళ్ళ నుంచి సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు సెంచరీలు చేసిన కోహ్లీ ఇప్పుడు తక్కువ పరుగులకే వికెట్లు చేజార్చుకుంటున్నాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి నిరాశ పరచడం చేస్తూ ఉన్నాడు కోహ్లీ. ఈ క్రమంలోనే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ ఫామ్ పై స్పందిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.



 ఇటీవలే ఇంగ్లాండ్లో జరిగిన వార్మప్ మ్యాచ్లో మంచి పరుగులు చేసిన కోహ్లీ టెస్ట్ లో అదరగొట్టారు అని అందరూ అనుకున్నారు. ఊహించని విధంగా 11 పరుగులు చేసి వికెట్లు చేజార్చుకున్నాడు. దీంతో మళ్లీ విమర్శలు వస్తున్నాయ్. ఇలాంటి సమయంలో  కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రేమ్ స్వాన్. ఇటీవల టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ దురదృష్టవశాత్తు అవుటయ్యాడు.. విరాట్ కోహ్లీ ఫాంపై ఆందోళన చెందాల్సిన పని లేదు. అతనిలో పరుగుల దాహం ఇంకా అలాగే ఉంది. తప్పకుండా రన్స్ చేస్తాడు. అయితే బంతి ఎక్కువగా ఇన్ స్వింగ్ అవ్వడం వల్ల కోహ్లీ వికెట్ కోల్పోయాడు అంటూ గ్రేమ్ స్వాన్ మద్దతుగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: