ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్యన ఆగిపోయిన ఒక టెస్ట్ మ్యాచ్ , మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు జరగనున్నాయి. అందులో భాగంగా నిన్న ఆఖరి టెస్ట్ మ్యాచ్ ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. దీనితో సిరీస్ కూడా 2-2 తో సమం అయింది. మొదటిసారి ఇండియన్ కెప్టెన్ గా జట్టును నడిపించిన పేస్ బౌలర్ బుమ్రాకు శుభారంభం దక్కలేదు. అలా ఈ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో అడుగు పెట్టిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ పరాజయాన్ని అధిగమించి పరువు దక్కించుకోవాలంటే... రేపటి నుండి జరగబోయే టీ 20 సిరీస్ మరియు వన్ డే సిరీస్ ను ఎలాగైనా గెలుచుకుని గర్వంగా ఇండియాకు పయనం అవ్వాలి.

నిన్న మ్యాచ్ లో ఆడి రేపు సిరీస్ ఆడనున్న వారు తమకు తగిలిన పరాభవానికి బదులు తీర్చుకుంటుందా అన్నది చూడాలి. సొంత గడ్డపై ఇంగ్లాండ్ ను ఏ ఫార్మాట్ లో అయినా ఓడించడం అంత ఈజీ కాదు. కానీ వారిని ఓడించాలంటే వారికి అలవాటు అయిన దూకుడు పద్దతిలోనే దెబ్బ కొట్టాలి. రేపటి నుండి టీ 20 సిరీస్ ప్రారంభం అవుతుంది. అందులో గెలవాలి అంటే సరైన ప్రణాలికను రెడీ చేసుకోవాలి. ఆఖరి టెస్ట్ కు గాయం కారణంగా దూరం అయిన రోహిత్ శర్మ తిరిగి జట్టు కెప్టెన్సీ ని అందుకోనున్నాడు. ఇక రాహుల్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్ గా ఉంటాడు.

మొదటి మ్యాచ్ ను గెలిచి ఇంగ్లాండ్ పై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే సిరీస్ ను గెలవడానికి సాధ్యం అవుతుంది. ఐపీఎల్ లో ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మ, రుతురాజ్ లు తిరిగి ఫామ్ ను దొరకబుచ్చుకుంటే ఇండియాకు తిరుగుండదు. ఇక ఎప్పటిలాగే సూర్య కుమార్ యాదవ్, దీపక్ హూడా, హార్దిక్ పాండ్య మరియు దినేష్ కార్తీక్ లు ఆడితే గెలుపు లాంఛనమే. మరి ఏమి జరుగుతుంది అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: