కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా అదరగొడుతుంది అనుకున్న టీమిండియా మహిళల జట్టు మొదటి మ్యాచ్లోనే నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసింది భారత మహిళల జట్టు. దీంతో ఎంతో మంది అభిమానులు నిరాశ లో మునిగిపోయారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక కామన్ వెల్త్ గేమ్స్ లో రెండో మ్యాచ్ దాయాది దేశమైన పాకిస్థాన్లో జరిగింది. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్న భారత మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయాన్ని అందుకుంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.



 ఈ క్రమంలోనే భారత మహిళల జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ టీ20 ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన ఇక భారత కెప్టెన్ గా నిలిచింది. పురుషులు మహిళల క్రికెట్ లో కలిపి ఒక సరికొత్త రికార్డును నెలకొల్పింది అనే చెప్పాలి. ఇప్పుడు వరకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా  42 విజయాలను నమోదు చేసింది. అయితే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ కి ముందు వరకు కూడా టి 20 క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్గా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఉండేవాడు. ఇప్పటివరకు మహేంద్రసింగ్ ధోని అటు తన సారథ్యంలో 41 విజయాలు అందించాడు. ఇప్పటివరకూ పురుషుల క్రికెట్ లో మాత్రమే కాదు మహిళల క్రికెట్ లో కూడా ఎవరు ఈ రికార్డు అందుకోలేకపోయారు. ఇక ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా కు ఘన విజయాన్ని అందించి ధోని  రికార్డును బద్దలు కొట్టేసింది.


 భారత క్రికెట్ చరిత్రలోనే ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో ప్రేక్షకాదరణ పొందిన టి20 ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ గా అవతరించింది హర్మన్ ప్రీత్ కౌర్. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 30 విజయాలతో మూడవ స్థానంలో కొనసాగుతుండగా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 27 విజయాలతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించడంతో అటు భారత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: