కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా ప్రస్తుతం భారత మహిళల జట్టు అదరగొడుతోంది అన్న విషయం తెలిసిందే. వరుసగా విజయాలు సాధిస్తూ ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది భారత జట్టు. నేడు ఎంతో కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సెమీఫైనల్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. అయితే చావో రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మంచి ప్రదర్శన చేసింది అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన రెచ్చిపోయి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.


 ఏకంగా ఇంగ్లాండ్ బౌలర్లపై వీరవిహారం చేసింది అనే చెప్పాలి. సిక్సర్లు  ఫోర్లతో చెలరేగిపోయింది. ఈ క్రమంలోనే 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది స్మృతి మందన  కాగా అంతర్జాతీయ టీ20ల్లో ఒక అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది అన్నది తెలుస్తుంది. అంతర్జాతీయ టి20లో నాకౌట్ మ్యాచులలో ఇదే వేగవంతమైన అర్థశతకం కావడం గమనార్హం. అయితే గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లన్నింగ్  పేరిట ఉండేది. 27 బంతుల్లో అర్ధసెంచరీ చేసి అత్యంత వేగంగా అర్థ సెంచరీ చేసిన రికార్డు క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుతం మృతి మందాన తన  ప్రదర్శనతో ఈ రికార్డును బద్దలు కొట్టింది.


 అయితే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్లో మృతి మందాన విధ్వంసానికి ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం మొత్తం వణికిపోయింది  అని చెప్పాలి. అయితే మొత్తంగా 32 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 61 పరుగులు చేసిన మృతి మందాన టీమిండియాకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర వహించింది అని చెప్పాలి. అయితే సెమీఫైనల్ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టును తమ బౌలింగ్తో కట్టడి చేసేందుకు సిద్ధమైంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: