ఐపీఎల్ ద్వారా టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తన ఆల్రౌండ్ ప్రదర్శన తో తక్కువ సమయం లోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే టీమిండియా లో వరుసగా అవకాశాలు దక్కించుకున్నాడు. కానీ గత కొంత కాలం నుంచి గాయాల బెడద అతనిని వేధిస్తూ ఉంది. అయితే ఇటీవలే గాయం కారణం గా టీమిండియాకు దూరమైన వాషింగ్టన్ సుందర్ మళ్ళీ గాయం నుంచి కోలుకు న్నాడు. అయితే అతని ఫామ్ నిరూపించుకునేందుకు ఇటీవల  ఇంగ్లాండ్ వేదికగా కౌంటి ఛాంపియన్షిప్లో ఆడాడు. ఇక ఇప్పుడు దేశవాళి వన్డే టోర్నీలో కూడా లంకషైర్ జట్టు తరఫున ఆడుతున్నాడు.


 అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ మరోసారి గాయం బారిన పడ్డాడు అన్నది తెలుస్తుంది.  వొర్సిస్టెర్ షైర్   తో జరిగిన మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసిన సమయం లో ఎడమ భుజానికి గాయమైంది. దీంతో నొప్పి తో అతడు మైదానం వీడాడు. మళ్లీ గ్రౌండ్ లోకి రాలేదు. హాంప్షైర్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అతను జట్టులో లేడు. ఈ క్రమంలోనే అతని గాయం తీవ్రమైంది అనేది తెలుస్తుంది. అయితే ఇటీవల జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు.


 ఇక అటు నుంచి నేరుగా బెంగళూరు లోని జాతీయ క్రికెట్ అకాడమీకి వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. నేషనల్ క్రికెట్ అకాడమీ లోని పునరావాస శిబిరాల్లో పాల్గొనే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కాగా ఈ నెల 18 నుంచి హరారే వేదిక జింబాబ్వే తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది టీమిండియా. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లో బరిలోకి దిగ బోతోంది. దీంతో ఇక జింబాబ్వే పర్యటనకు కూడా వాషింగ్టన్ సుందర్ దూరమయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: