మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా మరో దేశ పర్యటన ముగించుకుకొనుంది  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీ నుంచి జింబాబ్వే పర్యటనలో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ద్వితీయశ్రేణి జట్లను జింబాబ్వే పర్యటనకు పంపించింది. అయితే మొదట శిఖర్ ధావన్ ను కెప్టెన్గా ఎంపిక చేసినప్పటికీ కె.ఎల్.రాహుల్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇక సారథ్య బాధ్యతలు కేఎల్ రాహుల్ కి అప్పగించి శిఖర్ధావన్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది.


 కాగా ఇప్పటికే భారత జట్టు జింబాబ్వే పర్యటనలో అడుగుపెట్టబోతోంది అన్న విషయం తెలిసిందే   అయితే కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో ఒక ఆటగాడికి అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు శుభమాన్ గిల్. సాధారణంగా ఎప్పుడూ ఓపెనర్లుగా బరిలోకి దిగుతు ఉంటాడు  అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ స్థానంలో వస్తాడు అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్లు ఆడిన శుభమాన్ గిల్ 205 పరుగులు చేశాడు.


 ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ ఆటగాడు దేవాంగ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్లో శుభమాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. శుభమాన్ గిల్ కు రానున్న రోజుల్లో భారత జట్టు మేనేజ్మెంట్ మరింత అవకాశాలు ఇస్తుందని భావిస్తున్న.. ఎందుకంటే అతడు వచ్చే ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో భారత ప్రణాళికలో భాగంగానే ఉన్నాడు. అయితే విండిస్ గడ్డపై అతను బాగా రాణించినప్పటికీ జింబాబ్వే పర్యటనలో మాత్రం అతనికి ఓపెనర్గా స్థానం దక్కదు.  ఇక గత కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్న కె.ఎల్.రావు మళ్లీ తన ఫామ్   పొందాలంటే జింబాబ్వే పర్యటన ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: