ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా టి20 క్రికెట్కు ఆదరణ రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే టీ20 ఫార్మాట్ కి బాగా అలవాటు పడిపోయిన క్రికెట్ ప్రేక్షకులు అటు వన్డే టెస్టు ఫార్మాట్ చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వెరసి క్రికెట్ ప్రేక్షకులు మొత్తం  టి20 ఫార్మాలో మాయలో పడిపోతున్న నేపథ్యంలో ఇక వన్డే ఫార్మాట్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి అన్న వార్తలు గత కొంత కాలం నుంచి హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్ ను కాపాడాల్సిన అవసరం ఉందని.. అంతర్జాతీయ క్రికెట్లో అదే అత్యుత్తమమైనది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


 టి20 ఫార్మాట్కు పెరిగిపోతున్న ఆదరణ నేపథ్యంలో రానున్న రోజుల్లో టెస్ట్, టి20 మాత్రమే మిగులుతాయి మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొంత మంది అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నంతకాలం క్రికెట్ కి వచ్చిన ముప్పేమీ లేదు అంటూ కుండబద్దలు కొడుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే క్రికెట్ భవిష్యత్తుపై ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని ఇదంతా నాన్సెన్స్ గా అనిపిస్తుంది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.


 పిచ్చి మాటల కారణం గా వన్డే ఫార్మాట్ కు జరిగే నష్టం ఏమీ లేదు అంటూ తెలిపాడు రోహిత్ శర్మ. వన్డే క్రికెట్కు నేను కట్టుబడి ఉన్నాను. ఎన్నటికీ వన్డే క్రికెట్ కనుమరుగు కాదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే వస్తుంది. కొన్నేళ్ళ క్రితం టెస్ట్ క్రికెట్ గురించి కూడా కొంతమంది పిచ్చోళ్ళు ఇలాంటివి మాట్లాడారు. టెస్ట్ క్రికెట్ కనుమరుగవుతుంది అనుకున్నారు. అలా జరగలేదు కదా టెస్టు ఫార్మాట్ పై మరింత అభిమానం ఎక్కువైంది. ఏ ఫార్మాట్ అయినా సరే దేనికి ఉండాల్సిన విలువ దానికి ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: